`మనం` అక్కినేని కుటుంబం అంతా సగర్వంగా చెప్పుకునే సినిమా. మూడు తరాల హీరోల్ని ఒకే ఫ్రేములో చూసుకునే ముచ్చటైన అవకాశాన్ని అక్కినేని అభిమానులకు కల్పించాడు విక్రమ్ కె.కుమార్. అందుకే విక్రమ్ అంటే నాగ్ కుటుంబానికి అంత ఇష్టం. ఆ తరవాత అఖిల్ తో `హలో` చేశాడు విక్రమ్. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే మరోసారి విక్రమ్‌కి ఛాన్సివ్వబోతున్నాడు. అక్కినేని హీరోతో విక్రమ్ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. నాగచైతన్య కోసం విక్రమ్ కె.కుమార్ ఓ కథ రెడీ చేసుకున్నట్టు సమాచారం.
ఈ కథని దిల్ రాజుకి ఎప్పుడో చెప్పాడట విక్రమ్. అప్పట్లో ఆ పాయింట్ ఆసక్తి కలిగించినప్పటికీ దిల్ రాజు ధైర్యం చేయలేదని, ఇప్పుడు మరోసారి ఈ కథపై వర్క్ జరుగుతోందని, అన్నీ కుదిరితే నాగ చైతన్యతో ఈ సినిమాని పట్టాలెక్కించే ఛాన్సు ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం `లవ్ స్టోరీ` సినిమాతో బిజీగా ఉన్నాడు చైతూ. త్వరలోనే విక్రమ్ కాంబోపై ఓ స్పష్టమైన ప్రకటన రావొచ్చు.