హారర్ సినిమా కాదంటున్న మనం డైరెక్టర్!

By Inkmantra - June 09, 2020 - 14:00 PM IST

మరిన్ని వార్తలు

విక్రమ్ కుమార్ కు మొదటి నుంచి క్రియేటివ్ ఫిలింమేకర్ అనే పేరుంది. ప్రతి సినిమాకు ఓ డిఫరెంట్ జోనర్ ఎంచుకోవడం విక్రమ్ ప్రత్యేకత. అయితే ఈ సారి నాగ చైతన్యతో చేయబోయే సినిమాకు విక్రమ్ ఓ హారర్ థ్రిల్లర్ కథ ఎంచున్నారంటూ టాక్ వినిపించింది. గతంలో విక్రమ్ దర్శకత్వం వహించిన '13B' సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుందని అన్నారు. అయితే తాజాగా ఈ విషయం పై విక్రమ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. చైతన్యతో రూపొందించనున్న సినిమా హారర్ థ్రిల్లర్ కాదని, ఇదో పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా '13B' సీక్వెల్ అనే రూమర్లకు తెరపడింది.

 

గతంలో విక్రమ్ కుమార్ - చైతన్య కాంబినేషన్లో 'మనం' లాంటి క్లాసిక్ తెరకెక్కింది. మరి ఈసారి ఎలాంటి కథతో రానున్నారో, చైతును ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారో అనేది ఆసక్తికరం. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తారని సమాచారం. నాగ చైతన్య డెబ్యూ ఫిలిం 'జోష్' తర్వాత దిల్ రాజు-చైతు కాంబినేషన్లో రానున్న రెండవ చిత్రం ఇది. ఈ సినిమాను మరో రెండు మూడు నెలలో సెట్స్ పైకి తీసుకెళ్తారని అంటున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS