'నాకు తెలిసిన ప్రపంచం ఇది కాదు' అంటూ టీజర్ ప్రారంభమైంది. అంటే ఈ మాటలోనే ఎన్నో భావోద్వేగాలు మిళితమై ఉన్నాయి. 'మనం బ్రతకాలంటే వాడికి ఎదురెళ్లాలి. ఇది ధైర్యం కాదు.. తెగింపు' ఈ మాటలు అంటున్నది మరెవరో కాదు, ఇటీవలే 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాతో హిట్ అందుకున్న అక్కినేని బుల్లోడు నాగ చైతన్య. తన కొత్త సినిమా 'యుద్ధం శరణం' సినిమాలోని డైలాగే ఇది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఇదో డిఫరెంట్ జోనర్ మూవీ అని టీజర్ చూస్తుంటే అర్ధమవుతోంది. 'ప్రేమమ్' నుండీ నాగ చైతన్య డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ, వరుసగా హిట్లు అందుకుంటున్నాడు. ఇప్పుడు ఇదిగో 'యుద్ధం శరణం' అంటూ మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. వారాహి బ్యానర్‌పై సాయి కొర్రపాటి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆర్.వి. కృష్ణ దర్శత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నాగ చైతన్య ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాతో మరో హిట్‌ని సొంతం చేసుకునేలానే ఉన్నాడు నాగ చైతన్య. అయితే టైటిల్‌కి తగ్గట్లుగా నాగ చైతన్య ఎవరితో యుద్ధం చేయనున్నాడు అనేది తెలియాలంటే కొంచెం వెయిట్ చేయాల్సిందే. అతి త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.