యాక్షన్‌ మోడ్‌లో 'అశ్వత్థామ'.

మరిన్ని వార్తలు

నాగశౌర్య హీరోగా సొంత బ్యానర్‌ అయిన ఐరా క్రియేషన్స్‌లో రూపొందుతోన్న చిత్రం 'అశ్వత్ధామ'. మెహ్రీన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాతో నాగశౌర్యలోని రచయిత బయటికొచ్చాడు. సొంత మేథస్సుతో ఈ సినిమా కథని ప్రిపేర్‌ చేశాడు నాగశౌర్య. 'అశ్వత్ధామ' అనే పవర్‌ ఫుల్‌ టైటిల్‌ పెట్టాడు సినిమాకి. పక్కా యాక్షన్‌ ఓరియెంటెడ్‌ మూవీగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట. సినిమాకి యాక్షన్‌ ఎపిసోడ్స్‌ హైలైట్‌ అవుతాయని ఎప్పటి నుండో చెబుతున్నారు. ఇంతకు ముందెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో ఈ సినిమాలోని యాక్షన్‌ ఎపిసోడ్స్‌ చిత్రీకరించారట.

 

క్రిస్‌మస్‌ సందర్భంగా యాక్షన్‌ మోడ్‌లో ఉన్న పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. కండలు తిరిగిన దేహంతో, కోపంగా కనిపిస్తున్నాడు నాగశౌర్య ఈ పోస్టర్‌లో. యాక్షన్‌ మోడే కానీ, డిఫరెంట్‌ కాన్సెప్ట్‌లో కనిపిస్తోంది ఈ పోస్టర్‌. బ్యాక్‌ గ్రౌండ్‌లో కాషాయ వస్త్రాలు ధరించిన ఓ క్రౌడ్‌ జోష్‌గా కనిపిస్తుంటే, ఆ క్రౌడ్‌లోని ఓ వ్యక్తిని కసిగా కుమ్మేస్తున్నాడు మన హీరో నాగశౌర్య. చాక్లెట్‌ బోయ్‌లా, పక్కింటబ్బాయ్‌లా కూల్‌గా కనిపించే నాగశౌర్య ఇంత కోపంగా కనిపించడం కొత్తగా అనిపిస్తోంది. ఈ నెల 27న 'అశ్వత్ధామ' టీజర్‌ రిలీజ్‌ చేయనున్నారు. టీజర్‌ వస్తే, అసలు మనోడి యాక్షన్‌ మోడ్‌ ఏంటో బ్రీఫ్‌గా తెలిసే అవకాశాలున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS