నచ్చితేనే చేస్తానంటోన్న మలర్‌ బ్యూటీ.!

మరిన్ని వార్తలు

కథ నచ్చాలి. సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత దక్కాలి. అలా అయితేనే, ముద్దుగుమ్మ సాయి పల్లవి ఆ సినిమాకి సైన్‌ చేస్తుంటుంది. కమర్షియల్‌ హీరోయిన్‌ కాగ సత్తా చాలా ఈజీగా ఈ అమ్మడిలో ఉన్నప్పటికీ, సద్వినియోగం చేసుకోవడం లేదు. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ మంచి నటి అనిపించుకోవడానికే ప్రయత్నిస్తోంది. ఇంతవరకూ ఆమె సెలెక్షన్‌ మిస్‌ ఫైర్‌ కాలేదు. నటిగా ఆమెని ఒక్కో మెట్టు పైకి ఎక్కించిన సినిమాల్లోనే సాయి పల్లవి నటించింది. ప్రస్తుతం సాయి పల్లవి ‘లవ్‌ స్టోరీ’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా నటిస్తున్నాడు.

 

లేటెస్ట్‌గా రిలీజ్‌ చేసిన ‘ఏయ్‌ పిల్లా..’ వీడియోతో ఈ సినిమా అప్పుడే హిట్‌ కళను దక్కించేసుకుంది. ఇకపోతే, సాయి పల్లవికి మరిన్ని క్రేజీ ఆఫర్స్‌ వస్తున్నాయట. కానీ, వాటన్నింటినీ సున్నితంగా తిరస్కరించేస్తోందట. ఈ తరుణంలో ఫ్యాన్స్‌ సాయి పల్లవికి హిత బోధ చేస్తున్నారట. టాలీవుడ్‌లో ఉన్న హీరోయిన్స్‌ కొరత తీరాలంటే, ఈ నేచురల్‌ బ్యూటీ తన మనసు మార్చుకోవాలనీ, ఆడియన్స్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ అందుకోవాలనీ, అందుకోసం వరుస చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపాలనీ సాయి పల్లవిని రిక్వెస్ట్‌ చేస్తున్నారట.

 

ఇంతవరకూ యంగ్‌ హీరోలకే పరిమితమైన సాయి పల్లవిని త్వరలోనే స్టార్‌ హీరోల సరసన చూడాలన్న ఫ్యాన్స్‌ కోరిక తీరాలంటే, అది ఆమె చేతుల్లోనే ఉందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేని విషయం. అయితే, ఇక్కడే ఓ చిన్న చిక్కు వచ్చి పడిరది. సాయి పల్లవి స్క్రీన్‌పై ఉంటే, పక్కన ఉన్న హీరో ఎంత టాలెంటెడ్‌ అయినా, ఆమె ముందు అస్సలు కనిపించడు. అంతలా ఆమె తన నటనతో మాయ చేసేస్తుంది. ఒక్క మాటలో చెప్పాంటే డామినేట్‌ చేసేస్తుంది. అందుకేనేమో ఆమెను స్టార్‌ హీరోలు పట్టించుకోవడం లేదేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS