నటుడిగా సత్తా చాటుతూనే, ఫీల్‌గుడ్ మూవీస్ అంటూ సెలెక్టెడ్‌గా రెండు సినిమాలను తెరకెక్కించి దర్శకుడిగానూ మంచి పేరు తెచ్చుకున్నాడు అవసరాల శ్రీనివాస్. దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన 'జ్యో అచ్చుతానంత' కూడా మంచి సక్సెస్ ఇచ్చింది అవసరాలకు.
ఇకపోతే ముచ్చటగా మూడో సినిమాని తనకు అత్యంత ప్రాణ స్నేహితుడైన నానితో తెరకెక్కించాలని వెయిట్ చేశాడు. కానీ అది ఇప్పుడప్పుడే కుదిరేలా కనిపించడం లేదు. దాంతో తనకు బాగా అచ్చొచ్చిన హీరో నాగశౌర్యతోనే మళ్లీ మూడో సినిమాకీ రంగం సిద్ధం చేస్తున్నాడట అవసరాల.
సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అయిన ఈ కాంబోలోనే తదుపరి చిత్రం ఉండేలా ఉందని తెలుస్తోంది. అంతేకాదు బ్యానర్ కూడా సేమ్. వారాహి బ్యానర్‌లోనే ఈ చిత్రం రూపొందనుంది. ఒకే హీరో ఒకే బ్యానర్‌కి కమిట్ అయిపోయిన శ్రీనివాస్ అవసరాల ఈ సారి కూడా ఆ రేంజ్‌లోనే సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలిక.
ఇకపోతే నాగశౌర్య విషయానికి వస్తే, ఇటీవల 'ఛలో' సినిమాతో హిట్ కొట్టి, 'అమ్మమ్మగారిల్లు'తో ఓకే అనిపించుకున్నాడు. ప్రస్తుతం సొంత బ్యానర్‌లో 'నర్తనశాల' సినిమాలో నటిస్తున్నాడు నాగశౌర్య. ఈ సినిమా పూర్తి కాగానే అవసరాల సినిమాకి రెడీ అయ్యే అవకాశాలున్నాయనీ తాజా సమాచారమ్.
తొలి సినిమాని ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గానూ, రెండో సినిమాకి విభిన్న ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ ఎంటర్‌టైనింగ్ డ్రామాగానూ తెరకెక్కించిన అవసరాల ముచ్చటగా మూడో సినిమా కోసం ఎలాంటి స్క్రిప్టు ప్రిపేర్ చేశాడో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి.