నాగశౌర్యకు అసలు ఏమైంది.?

మరిన్ని వార్తలు

ఫ్యామిలీ హీరోగా, పక్కింటబ్బాయ్‌గా యంగ్‌ హీరోల్లో మంచి ఫాలోయింగ్‌ ఉన్న హీరో నాగశౌర్య అప్‌ అండ్‌ డౌన్స్‌ చూస్తూ అలా అలా కెరీర్‌ని ముందుకు నడిపిస్తున్నాడు. ఎక్కువగా తన సినిమాల్లో అమ్మాయిలకు సంబంధించిన పాయింట్‌ని టచ్‌ చేస్తాడన్న టాక్‌ ఉంది నాగశౌర్యకు. అయితే, అది రీల్‌ వరకూ మాత్రమే. రియల్‌గా అమ్మాయిలపై మనోడు అంతగా మంచి అభిప్రాయమున్నోడు కాదనేది ఇటీవల ఆయన ప్రవర్తన ద్వారా అర్ధమవుతోందనే టాక్ బాగా వినిపిస్తోంది. మొన్నామధ్య ‘కణం’ సినిమా టైమ్‌లో హీరోయిన్‌ సాయి పల్లవి అనవసరపు ఆరోపణలు చేసి, మీడియాకి టార్గెట్‌ అయ్యాడు. తాజాగా మరో ముద్దుగుమ్మ మెహ్రీన్‌ని కూడా టార్గెట్‌ చేశాడు.

 

‘అశ్వథ్ధామ’ సినిమా టైమ్‌లో తన పర్సనల్‌ ప్రాబ్లెమ్స్‌ కారణంగా ఒక్క ఇంటర్వ్యూకి హాజరు కానందుకు మెహ్రీన్‌ని ఆడేసుకుంటున్నాడు నాగశౌర్య. పాపం మెహ్రీన్‌, ఈ హీరో దెబ్బకి షాకై, మీడియా ముఖంగా తన గోడు వెల్లిబుచ్చుకోవల్సి వచ్చింది . నాగశౌర్య ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో తెలియడం లేదు ఆయన ఫ్యాన్స్‌కి. మరోవైపు అమ్మాయిలనే కాదు, అబ్బాయిల్నీ వదిలిపెట్టడు నాగశౌర్య.. అంటున్నారు. అందుకు కారణం ఇటీవల ‘భీష్మ’తో హిట్‌ కొట్టిన డైరెక్టర్‌ వెంకీ కుడుములను కూడా అలాగే ఆడిపోసుకుంటున్నఢీ యంగ్ హీరో . వెంకీ తనకు మంచి ఫ్రెండ్‌ అని చెప్పుకుంటూనే, ఆయనపై ఆరోపణలు చేయడం మొదలు పెట్టాడు. ‘భీష్మ’ రిలీజ్‌కి ముందు చేసిన ఆరోపణల్ని సినిమా హిట్‌ అయ్యాకా కూడా ఆపడం లేదు. వీలు చిక్కినప్పుడల్లా వెంకీని నెగిటివ్‌ చేసే ప్రయత్నం చేస్తున్నాడు నాగశౌర్య. ఈ తీరును చాలా మంది తప్పుపడుతున్నారు. ఎంతో ఇష్టపడి చేసిన ‘అశ్వత్థామ’ సినిమాకి హిట్‌ టాక్‌ రాలేదనే జలసీతోనే నాగశౌర్య ఇలా చేస్తున్నాడా.? స్వతహాగా శౌర్య అలాంటోడు కాదే.. చాలా మంచి పిల్లోడే.. అంటూ సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు సందిగ్ధంలో వున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS