నాగశౌర్య అస్వస్థతకు గురయ్యారు. షూటింగ్ లో కళ్లు తిరిగి పడిపోయారు. చికిత్స కోసం ఆయన్ను ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. తన కొత్త చిత్రంలోని పాత్ర కోసంకొన్ని రోజులుగా హెవీ వర్క్ అవుట్లు చేస్తున్నారు శౌర్య. దాని కారణంగా ఆరోగ్యం దెబ్బతిందని. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
శౌర్య ప్రస్తుతం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’, ‘నారీ నారీ నడుమ మురారి’, ‘పోలీసు వారి హెచ్చరిక’, #NS24 చిత్రాలతో బిజీగా వున్నారు. తాజాగా ఆయన వివాహం కూడా కుదిరింది. నాగ శౌర్య వివాహం నవంబర్ 20న అనూషతో బెంగళూరులో జరగనుంది.