సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టేసిన నాగ శౌర్య

By iQlikMovies - August 21, 2018 - 16:22 PM IST

మరిన్ని వార్తలు

ఈమధ్యకాలంలో ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరోలలో ఎక్కువ శాతం సక్సెస్ ల మీదున్న హీరో నాగ శౌర్య అని చెప్పొచ్చు. చూడడానికి అందం, తెర పై చూడడానికి అభినయం కలగలిపి ఉన్న ఈ యువ హీరో తాజాగా నర్తనశాల అంటూ మనముందుకి వస్తున్నాడు.

అయితే ఛలో చిత్రంతో తానే ఓ సొంత నిర్మాణ సంస్థని ఏర్పాటు చేసుకుని దానికి తన తల్లిని నిర్మాతని చేసేశాడు. ఇక ఆ చిత్రం పెద్ద హిట్ అవ్వడంతో తొలి చిత్రానికే భారీగా లాభాలు వచ్చేశాయి. ఇక ఇప్పుడు తన తదుపరి చిత్రం అయిన నర్తనశాలని కూడా అదే నిర్మాణ సంస్థలో నిర్మించాడు.

ఇక ఈ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకి రానుంది. అయితే ఈ చిత్రం పైన ఉన్న నమ్మకంతో ఈ సినిమా ప్రమోషన్ల కోసం చాలా భారీగా ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యాడట. కాకపోతే ఇండస్ట్రీ లో ఎవరి మార్కెట్ బట్టి వారి సినిమాలకి ప్రొమోషన్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ చిత్రానికి మాత్రం కాస్త పరిమితికి మించే ఖర్చు చేయనున్నారట.

ఈ నిర్ణయానికి కారణం, తమ సినిమా పైన ఉన్న నమ్మకమే అని చెప్పుకుంటున్నారు. మరి వీరి నమ్మకాన్ని నిలబెడుతూ ఈ చిత్రం ప్రేక్షకుల మనసులని గెలుచుకుని నాగ శౌర్యకి మంచి లాభాలు తెచ్చిపెట్టాలని కోరుకుందాం..

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS