మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈరోజు సైరా టీజర్ ని విడుదల చేసిన సందర్భంగా యూనిట్ మొత్తం విలేకరులతో ముచ్చటించింది.
ఈ తరుణంలో నిర్మాత అయిన రామ్ చరణ్ ని ఈ సినిమా కి బడ్జెట్ ఎంత అని ఒక విలేకరి ప్రశ్నించగా, రామ్ చరణ్ నవ్వుతూ... ఈ సమయంలో బడ్జెట్ ఎంత అని కచ్చితంగా చెప్పలేను. అయితే ఈ సినిమా నాన్నగారి కల, అందుకనే ఖర్చుకి ఏ మాత్రం వెనుకాడకుండా ఈ సినిమా ని నిర్మిస్తున్నాను.
పైగా ఈ సినిమాకి లాభాలు వస్తాయా లేదా అన్న ఆలోచన లేకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాము. దీనికి కారణం- నాన్నగారికి తన కెరీర్ లోనే ఇటువంటి ఒక సినిమా చెయ్యాలి అన్న కోరిక ఉండడం దానికి అనుగుణంగా ఇది తెరకేక్కిస్తుండడంతో ఈ చిత్రం వరకు బడ్జెట్ కి అతీతంగా ఉండబోతుంది.
ఇది మెగా పవర్ స్టార్ చెప్పిన ‘మెగా’ మాట.