నాగశౌర్య టైటిల్‌కొచ్చిన చిక్కులేంటబ్బా.!

By iQlikMovies - August 01, 2018 - 12:25 PM IST

మరిన్ని వార్తలు

'ఛలో' సినిమాతో సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టి జోరు మీదున్న హీరో నాగశౌర్య. తాజాగా 'నర్తనశాల' సినిమాలో నటిస్తున్నాడు. 'నర్తనశాల' అనే టైటిల్‌ సీనియర్‌ ఎన్టీఆర్‌ సినిమా టైటిల్‌ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలాంటి క్లాసిక్‌ టైటిల్స్‌ని పెట్టుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతో ఆలోచించి గానీ ఇలాంటి టైటిల్స్‌ని టచ్‌ చేయకూడదు. 

అలాంటిది మనోడు ఈ టైటిల్‌ని ఈజీగా పెట్టేసుకున్నాడు. సరే, ఇప్పుడీ టైటిల్‌ విషయంలోనే కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టైటిల్‌ అయితే పెట్టారు కానీ, ఈ సినిమా కథా, కమామిషు ఏంటనేది ఎవ్వరికీ తెలీదు. అయితే లేటెస్టుగా ఈ సినిమాలో నాగశౌర్య క్యారెక్టర్‌ ఇదీ అంటూ ఓ ప్రచారం జరుగుతోంది. అదేంటంటే, నాగశౌర్య బృహన్నల క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడట ఈ సినిమాలో. అదే ఈ సినిమా టైటిల్‌కి వచ్చిన అభ్యతరమన్నమాట. 

'నర్తనశాల' అనే టైటిల్‌కున్న పవిత్రతను ఈ తరహా క్యారెక్టర్స్‌తో పాడు చేయవద్దని ఆ అభ్యంతరకారుల అభిప్రాయం. అయితే నాగశౌర్య మాత్రం అభ్యంతరకరమైన అంశాలేమీ ఈ సినిమాలో ఉండబోవనీ ఆలోచించే ఈ టైటిల్‌ని పెట్టామనీ, సినిమా చూస్తే, అసలీ టైటిల్‌ ఎందుకు పెట్టామనేది తెలుస్తుందని స్పష్టం చేశాడు. 

లేటెస్టుగా ఈ సినిమా నుండి ప్రోమో సాంగ్‌ను విడుదల చేశారు. హీరో, హీరోయిన్‌ కారులో వెళ్తున్నట్లుగా చూపించారు ఆ వీడియోలో. 'ఎగిరెనే మనసు సీతాకోక చిలుకలాగా..' అంటూ సాగే ఆ పాట చాలా ఆహ్లాదంగా అనిపిస్తోంది. విడుదలైన కాస్సేపట్లోనే ఈ సాంగ్‌కి లక్షల్లో వ్యూస్‌ వచ్చేశాయి. కాశ్మీరా, యామినీ భాస్కర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శ్రీనివాస్‌ చక్రవర్తి తెరకెక్కిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS