చెన్నయ్‌లో సాయేషా కులాసా.!

మరిన్ని వార్తలు

'అఖిల్‌' సినిమాతో గంపెండంత ఆశలతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మ సాయేషా సైగల్‌కి తొలుతలోనే చుక్కెదురైంది. 'అఖిల్‌' డిజాస్టర్‌ అవ్వడంతో, టాలెంట్‌ ఎంతున్నా, అమ్మడికి అవకాశాలు దక్కలేదు. దాంతో కోలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకుంది. 'వనమగన్‌' చిత్రంతో అక్కడ ఎంట్రీ ఇచ్చిన సాయేషాకు మంచి గుర్తింపే దక్కింది. తర్వాత కార్తీతో, సూర్యతో ఇలా వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. 

ప్రస్తుతం ఆర్యతో 'గజనీకాంత్‌' సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే 'కడైకుట్టి సింగం' చిత్రంతో మంచి విజయం అందుకుంది. అదే 'చినబాబు'గా తెలుగులోనూ విడుదలై మంచి విజయం అందుకుంది. కాగా ప్రస్తుతం తమిళంలో సాయేషాకు ఆఫర్ల వరద ముంచెత్తుతోందట. యంగ్‌ హీరోస్‌, సీనియర్‌ హీరోస్‌ పక్కన కూడా సాయేషాకు ఛాన్సెస్‌ దక్కుతున్నాయని కోలీవుడ్‌ సమాచారమ్‌. తెలుగులో ఆదరణ దక్కకపోయినా, తమిళంలో ఈ స్థాయిలో ఆదరణ దక్కినందుకు పట్టరాని సంతోషంతో ఉబ్బి తబ్బిబ్పైపోతోంది ముద్దుగుమ్మ సాయేషా సైగల్‌.

 

యాక్టింగ్‌ టాలెంట్‌, డాన్సింగ్‌ టాలెంట్‌ ఇలా సాయేషాలో చాలా కోణాలున్నాయి. ఒక్కో సినిమాతోనూ ఒక్కో మెట్టు ఎక్కుతూ, తమిళంలో రాకెట్‌ స్పీడుతో దూసుకెళ్లపోతోంది సాయేషా కెరీర్‌. యాక్టింగ్‌లో తనదైన ప్రత్యేక ముద్ర వేసే దిశగా సాయేషా ప్రయత్నాలు చేస్తోందట. ఇలాగే కొనసాగితే త్వరలోనే కోలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా సాయేషా పేరు తెచ్చుకోవడం ఖాయమని కోలీవుడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS