ఛలో చిత్రంతో ఒక మంచి కమర్షియల్ హిట్ సాధించిన నాగశౌర్య తన తదుపరి చిత్రాల పైన దృష్టిపెట్టాడు.
అందులో భాగంగానే కొత్త దర్శకుడు అయిన కళ్యాణ్ చక్రవర్తి చెప్పిన కథకి పచ్చ జెండా ఊపేశాడట. కథ బాగా నచ్చడంతో వెంటనే షూటింగ్ ప్రారంబించే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. అన్ని కుదిరితే ఈ చిత్రం వచ్చే నెలలోనే సెట్స్ పైకి వెళ్ళే అవకాశముందట.
ఇక ఈ చిత్రానికి దర్శకుడిగా చేయనున్న కళ్యాణ్ చక్రవర్తి గతంలో ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి వద్ద అసోసియేట్ గా పనిచేశాడట. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు చేస్తున్నారు అలాగే మిగతా తారాగణం గురించి వివరాలు తెలియాల్సి ఉంది.
నాగశౌర్య తన గత చిత్రం ఛలో లో కూడా నూతన దర్శకుడిని పరిచయం చేశాడు ఇక ఇప్పుడు మరోసారి కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వనుండడం విశేషం.