లవర్ బోయ్ ఇమేజ్ ని సంపాదించుకున్న హీరో.. నాగశౌర్య. ఊహలు గుసగుసలాడే నుంచి ఛలో వరకూ.. శౌర్యకు విజయాల్ని అందించినవన్నీ ప్రేమకథలే. అలాంటి కథలకు కేరాఫ్ అయ్యాడు శౌర్య. కాకపోతే.. మధ్యమధ్యలో కొన్ని మాస్ కథల్ని ఎంచుకున్నాడు. జాదూగాడు, అశ్వద్ధామ లతో మాస్ ని అలరించడానికి ప్రయత్నించాడు. కానీ సరైన ఫలితాలు రాలేదు.
అయితే మాస్ ఇమేజ్ పై మమకారం చావలేదు శౌర్యకు. అందుకే ఇప్పుడు మాస్ హీరోగా ఎదగడానికి తనని తాను సిద్ధం చేసుకుంటున్నాడు. అందులో భాగంగా కండలు పెంచే కార్యక్రమం చేపట్టాడు. లాక్ డౌన్ సమయంలో ఇంటి పట్టునే ఉన్న శౌర్య.. ఇప్పుడు బాడీ బిల్డింగ్ పై శ్రద్ధ పెట్టాడు. ఇంట్లోనే ఓ జిమ్ ఏర్పాటు చేసుకుని, కసరత్తులు ముమ్మరం చేశాడు. జుట్టు, గడ్డం, కండలు పెంచి - మాస్ హీరోకి కావల్సిన పర్ఫెక్ట్ షేపు తెచ్చుకుంటున్నాడు. ఈ లాక్ డౌన్ సమయంలో నాగశౌర్య రెండు కొత్త కథల్ని ఒప్పుకున్నాడట. అందులో ఒకటి మాస్ స్టోరీ అని తెలుస్తోంది. అందుకోసమే.. ఇలా కండలు పెంచడం మొదలెట్టాడట. మొత్తానికి నాగశౌర్యలోని మాస్ హీరో మరోసారి నిద్రలేచాడు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
Handsome Hero 🤩 @IamNagashaurya
— iQlik Movies (@iqlikmovies) July 13, 2020
On Serious Workout 💪💪 Mode #NagaShaurya
Handsome Hero 😍 @IamNagashaurya
Getting Ready For Next 🔥🔥#nagashaurya pic.twitter.com/uTTw7rJSes