'మూగ‌మ‌న‌సులు'... మ‌ళ్లీ వ‌స్తోంది.

మరిన్ని వార్తలు

మూగ‌మ‌న‌సులు- తెలుగు చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌లో.. క్లాసిక్‌గా అనిపించుకున్న చిత్రం. ఇందులోని పాట‌లు, పాత్ర‌లు, మాట‌లు, స‌న్నివేశాలు.. అన్నీ గుర్తే! ఇప్పుడు ఈ టైటిల్‌ని మ‌రోసారి గుర్తు చేయ‌బోతున్నాడు నాగ‌శౌర్య‌. త‌ను క‌థానాయ‌కుడిగా సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించడానికి స‌న్నాహాలు చేస్తోంది. ల‌క్ష్మీ సౌజ‌న్య ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం అవుతోంది. ఈ చిత్రానికి మూగ‌మ‌న‌సులు అనే పేరు ఖ‌రారు చేయాల‌ని భావిస్తున్నారు.

 

అయితే అప్ప‌టి మూగ‌మ‌న‌సులు చిత్రానికీ, ఈ క‌థ‌కీ ఎలాంటి సంబంధం ఉండ‌దు. ఇది వేరే క‌థ‌. అక్టోబ‌రు నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంది. మ‌రి ఈ మూగ‌మ‌న‌సులు ఎలా ఉంటుందో? దీని క‌థేమిటో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాలి. ప్ర‌స్తుతం నాగ‌శౌర్య `అశ్వ‌ద్ధామ‌`లో న‌టిస్తున్నాడు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS