150 సినిమాలు చేసిన నాన్నగారికి నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను.. అంటూ 'సైరా' ప్రస్థావన తీసుకొచ్చాడట డైరెక్టర్ సురేందర్ రెడ్డి వద్ద రామ్ చరణ్. ఆ ప్రాజెక్ట్‌కి మీరే దర్శకత్వం వహించాలి అని సూరిని అడిగితే, వెంటనే ఆయన అభిప్రాయం చెప్పకుండా, కొంత టైం కావాలి అని చెప్పాడట. 15 రోజులు ఆలోచించి అప్పుడు ఓకే చేశారట. అంటే, ఆ ప్రాజెక్ట్‌కి తాను న్యాయం చేయగలనో లేదో, చరణ్ ఆశించినట్లుగా చిరంజీవిగారిని సంతృప్తి పరిచే బహుమతి అవుతుందో లేదో అని చాలా ఆలోచించి ఓ మంచి సంకల్పంతో సురేందర్ రెడ్డి అండ్ టీమ్ ఈ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించారట.
ఈ సినిమా చేయడానికి మీ ధైర్యం ఏంటని అడిగితే, నా వెనక చరణ్ ఉన్నాడన్న ధైర్యమే నన్ను ఈ సినిమా చేయడానికి పురిగొల్పింది అని సురేందర్ రెడ్డి అంతటి డైరెక్టర్ చెప్పడం నిజంగా గొప్ప విషయం. సైరాని ఓ సినిమాలా కాకుండా, ఓ యజ్ఞంలా పూర్తి చేశారు. ఈ సినిమా సక్సెస్ అవుతుందా? లేదా? అని ఆలోచించలేదు. డబ్బులు వస్తాయా? లేదా? అని కూడా అనుకోలేదు. 150 సినిమాలు చేసిన ఓ వ్యక్తి కెరీర్‌లో ఇలాంటి ఓ సినిమా ఉండాలి.
చరిత్ర ఎప్పుడూ ఆయన్ని మర్చిపోకూడదనే, చరిత్ర మర్చిపోయిన తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడి జీవిత గాథను ఆయన 151వ చిత్రంగా తెరపైకి తీసుకొచ్చామన్నారు 'సైరా' నిర్మాత రామ్‌చరణ్. ట్రైలర్ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో రామ్‌చరణ్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి చాలా జోష్‌గా కనిపించారు. సినిమా అవుట్ పుట్‌పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇక ట్రైలర్‌కి ఊహించినట్లుగానే మార్వ్‌లెస్ రెస్పాన్స్ వస్తోంది.