తొలి కాంబినేషనే హిట్ కాంబినేషన్ అని ప్రూవ్ అయ్యింది. ఏంటా హిట్ కాంబినేషన్ అంటే, ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం 'చలో'. మంచి విజయాన్ని అందుకుంది. నాగశౌర్య, రష్మికా మండన్నా జంటగా వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి నాగశౌర్యనే ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. కాగా ముద్దుగుమ్మ రష్మికా మండన్నాకి ఇదే తొలి తెలుగు చిత్రం కావడం, తొలి చిత్రంతోనే మంచి హిట్ కొట్టేయడంతో ఈ ముద్దుగుమ్మ ఎంత పాపులర్ అయిపోయిందో తెలిసిన సంగతే.
పెయిర్ చాలా బాగుందనీ, హిట్ పెయిర్ అనీ ప్రచారం జరగడంతో నాగశౌర్య తన తదుపరి చిత్రానికి కూడా ఈ ముద్దుగుమ్మనే హీరోయిన్గా ఎంచుకోబోతున్నాడనీ సమాచారమ్. నాగశౌర్య హీరోగా ఓ కొత్త దర్శకుడితో ఓ సినిమా తెరక్కెబోతోంది. ఆ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుందనీ తెలుస్తోంది. ఆ సినిమాలో హీరోయిన్గా మలయాళీ భామ రష్మికానే కావాలంటున్నాడట నాగశౌర్య. మొదట్లో ఈ సినిమాకి వేరే హీరోయిన్ అనుకున్నారట. అయితే నాగశౌర్య సూచనల మేరకు ఈ సినిమాలో రష్మికానే నటించే అవకాశాలున్నాయనీ తెలుస్తోంది.
ఈ మధ్య యంగ్ హీరోలు ఒక సినిమాలో నటించిన హీరోయిన్స్‌ని తమ తదుపరి సినిమాకి కూడా రిపీట్ చేయడంలో బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనిపిస్తోంది. మొన్నీ మధ్యనే యంగ్ హీరో నితిన్ కూడా 'లై' సినిమాలో నటించిన మేఘా ఆకాష్‌ని 'ఛల్ మోహన్‌రంగా' చిత్రానికి కూడా రిపీట్ చేశాడు. అలాగే ఇప్పుడు మన నాగశౌర్య కూడా అదే పని చేస్తున్నాడనిపిస్తోంది.
ఇదిలా ఉండగా నాగశౌర్య నటించిన మరో చిత్రం 'కణం' త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది.