ఈమధ్య టైటిళ్లు కొత్త పంథాలో వెళ్తున్నాయి. సర్కారు వారి పాట, ఇచట వాహనములు నిలపరాదు లాంటి వెరైటీ టైటిళ్లు పెడుతున్నారు. ఇప్పుడు నాగశౌర్య కూడా అదే దారిలో వెళ్తున్నాడు. హరీష్ శంకర్ శిష్యుడు రాజా దర్శకత్వంలో నాగశౌర్య ఓసినిమా చేయబోతున్నాడు. దీనికి `పోలీసు వారి హెచ్చరిక` అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. ఇదో క్రైమ్ థ్రిల్లర్. నాగశౌర్య పోలీసు కాదు గానీ, నాగశౌర్య వెంట పోలీసులు పడతార్ట.
వాళ్లెందుకు పడ్డారు? వాళ్ల నుంచి శౌర్య ఎలా తప్పించుకున్నాడు అన్నదే కథ. రేపు నాగశౌర్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని అధికారికంగా ప్రకటించే అవకాశం వుంది. లక్ష్య అనే మరో సినిమా చేస్తున్నాడు నాగశౌర్య. ఈసినిమాకి సంబంధించిన టీజర్ శుక్రవారం విడుదల అవుతుంది. ఇవి కాక.. నాగశౌర్య చేతిలో మరో రెండు సినిమాలున్నాయి. వాటి డిటైల్స్ కూడా త్వరలోనే బయటకు వస్తాయి.