యంగ్ హీరో నాగశౌర్య వరుస పెట్టి సినిమాలు ఓపెన్ చేస్తున్నాడు. ఇప్పటికే నాగశౌర్య చేతిలో మూడు ప్రాజుక్టులున్నాయి. వీటితో పాటు మరో కొత్త సినిమాని లాంఛనంగా ప్రారంభించేశాడు. సంతోష్ జాగర్లమూడి ఈ సినిమాకి దర్శకుడు. శరత్ మరార్, రామ్మోహనరావు, నారాయణ దాస్ నారంగ్‌లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 'అశ్వద్ధామ' సినిమాలో నటిస్తున్నాడు నాగశౌర్య. మెహ్రీన్ కథానాయికగా నటిస్తోంది.
వీటితో పాటు మరో రెండు సినిమాల్నీ ఈ మధ్య లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఒక్కో సినిమానీ పట్టాలెక్కిస్తూ వస్తున్నాడు. వరుసపెట్టి ఒక్కోటి పూర్తి చేయనున్నాడట. ఇటీవల 'ఓ బేబీ' సినిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పించాడు నాగశౌర్య. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న నాలుగు సినిమాలూ నాలుగు డిఫరెంట్ జోనర్స్‌కి సంబంధించినవట. నాలుగూ కమర్షియల్ యాంగిల్ మూవీసేనని తెలుస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'అశ్వధ్ధామ' చిత్రం త్వరలో షూటింగ్ కంప్లీట్ చేసుకొని, రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోనుంది.
ఇదిలా ఉంటే, సమాంతరంగా రెండు, రెండు సినిమాలు పూర్తి చేసే యోచనలో నాగశౌర్య ఉన్నాడట. గతంలో 'ఊహలు గుసగులాడే', 'జ్యో అచ్చుతానంద' తదితర చిత్రాలతో పాటు, 'ఛలో' సినిమాతో మంచి హిట్స్ తన ఖాతాలో వేసుకున్న నాగశౌర్య, ఇప్పుడు కూడా సూపర్ హిట్స్‌పై కన్నేశాడట. వరుస పెట్టి ప్రాజెక్టులు ఓకే చేస్తూ, వీలైనంత ఎర్లీగా సినిమాలు పూర్తి చేసి, విడుదల చేయనున్నాడట. చూడాలి మరి, ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ నుండి మన యంగ్ హీరోకి ఎన్ని హిట్స్ సొంతమవనున్నాయో.