నాగశౌర్య ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. `కృష్ణ వ్రింద విహారి` ఇప్పుడు రిలీజ్‌కి రెడీగా ఉంది. సెప్టెంబరు 23న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు `ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి` జోరుగా షూటింగ్ జరుపుకొంటోంది.
ఇప్పుడు... మరో కొత్త సినిమాని పట్టాలెక్కించేశాడు. పవన్ బాసిమశెట్టి అనే కొత్త దర్శకుడి కథకు నాగశౌర్య ఓకే చెప్పాడు. ఈ సినిమాకి చెరుకూరి సుధాకర్ నిర్మాత. కథానాయికగా కొత్తమ్మాయి యుక్తి తరేజాని ఎంచుకొన్నారు. ఈరోజే హైదరాబాద్‌లో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. నాగశౌర్యకు లవ్ స్టోరీలు బాగా కలిసొచ్చాయి. తన హిట్ చిత్రాలలో వాటి భాగమే ఎక్కువ. అందుకే మరోసారి లవ్ స్టోరీని ఎంచుకొన్నాడు. ఏ.ఆర్.రెహమాన్ శిష్యుడు పవన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, 2023 ప్రధమార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.