మెగాబ్రదర్ నాగబాబు నిర్మాతగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా ఓ సినిమా రాబోతోందట. ఇప్పటికే సినిమాకి సంబంధించిన డిస్కషన్స్ ప్రారంభమయ్యాయని సమాచారమ్. ఓ యంగ్ డైరెక్టర్‌తో నాగబాబు, పవన్‌కళ్యాణ్ హీరోగా తెరకెక్కించబోయే సినిమా గురించి చర్చలు కొనసాగిస్తున్నాడని ఇన్‌సైడ్ సోర్సెస్ వెల్లడిస్తున్నాయి. అయితే పవన్‌కళ్యాణ్ డైరీ ఇప్పుడేమాత్రం ఖాళీ లేదు. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న పవన్‌కళ్యాణ్, 2019 ఎన్నికల కోసం తన జనసేన పార్టీని సిద్ధం చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. ఎ.ఎం.రత్నం నిర్మాతగా ఓ సినిమా చేయాల్సి ఉంది పవన్‌కళ్యాణ్. ఈ నేపథ్యంలో పవన్‌కళ్యాణ్‌తో నాగబాబు సినిమా చేయాలనుకున్నా అది ఇప్పట్లో సాధ్యం కాదంటున్నారు. ఇంకో వైపున బాబాయ్ పవన్‌కళ్యాణ్‌తో ఓ సినిమా నిర్మించడానికి 'కొణిదెల ప్రొడక్షన్స్' అధినేత, సినీ హీరో రామ్‌చరణ్ కూడా సన్నాహాలు చేస్తున్నాడు. గతంలో పవన్‌కళ్యాణ్, నాగబాబు కాంబినేషన్‌లో 'గుడుంబా శంకర్' సినిమా వచ్చింది. అయితే అది అంత పెద్ద విజయాన్ని అందుకోలేదు. ఇప్పటికైతే నాగబాబు, అల్లు అర్జున్ హీరోగా రూపొందనున్న 'నా పేరు సూర్య' సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసినదే కదా. చరణ్‌తో 'ఆరెంజ్' సినిమా తీసిన తర్వాత నిర్మాతగా నాగబాబు కొంత ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. అప్పటినుంచీ సినిమా నిర్మాణంలో ఈ మెగా బ్రదర్ కొంత ఆచి తూచి వ్యవహరిస్తున్నారు.