రిలీజ్ కి ముందే ట్యూబ్ లైట్ సీన్స్ లీక్?!

మరిన్ని వార్తలు

రంజాన్ సందర్భంగా సల్మాన్ ఖాన్ తన ఫ్యాన్స్ కి ట్యూబ్ లైట్ చిత్రం రూపంలో రంజాన్ తోఫా ఇవ్వనున్నాడు.

అయితే ఈ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వనున్న నేపధ్యంలో ఈ చిత్రంలోని కొన్ని సీన్స్ లీక్ అవ్వడం మొత్తం ట్యూబ్ లైట్ యూనిట్ ని షాక్ కి గురిచేసింది.

ఆ సీన్స్ కూడా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్ చేసిన సీన్స్ లీక్ అవ్వడంతో ఈ చిత్రానికి పెద్ద దెబ్బ అని టాక్ వినిపిస్తుంది. ఇదే తరహ లీక్ వ్యవహారం బాహుబలి 2 కి సైతం ఎదురయ్యింది.

మరి ఈ లీక్ వ్యవహారాన్ని దాటి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రదర్శన ఇవ్వనుందో చూడాలి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS