కాబోయే కోడల్ని కూతురు అని చెప్పడం ద్వారా నాగార్జున, సమంత మీద తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. నాగచైతన్యతో సమంత ఎంగేజ్మెంట్ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడిస్తూ 'మా అమ్మ నా కూతురైంది' అని ఎంగేజ్మెంట్ ఫొటోతో సహా కామెంట్‌ని పోస్ట్ చేశాడు నాగార్జున. 'మనం' సినిమాలో నాగచైతన్య, సమంత కలిసి నటించారు. బిట్టు అనే పాత్రలో నాగార్జున నటించగా, ఆ బిట్టుకి చిన్నప్పటి తల్లిదండ్రులు సమంత, నాగచైతన్య. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయే బిట్టు, పెద్దయ్యాక మళ్లీ జన్మించిన తన తల్లిదండ్రుల్ని ఒక్కటి చేయడమే 'మనం' కథ. హృదయాలకు హత్తుకునే కథాంశమది. ఆ సినిమాలో సమంత, నాగార్జునని 'బిట్టూ..' అని పిలుస్తోంటే ఎంతో క్యూట్‌గా ఉంటుంది కదూ! నిజంగానే ఈ సందర్భం చాలా అరుదైంది. ఏ ఒక్కరికీ దక్కని అదృష్టం. 'మనం' సినిమా అక్కినేని ఫ్యామిలీ సినిమా. అక్కినేని వారసులంతా కలిసి నటించిన సినిమా. ఆ సినిమాలో కీలకపాత్ర పోషించిన సమంత ఇప్పుడు ఆ ఫ్యామిలీలో ఒన్ ఆఫ్ ది మెయిన్ మెంబర్ అయ్యింది. ఆ సినిమాలో తల్లిగా నటించిన, కాదు కాదు జీవించిన సమంత ఇప్పుడు నిజజీవితంలో నాగార్జునకి కోడలయ్యింది. అందుకే నాగార్జున మా అమ్మ ఇప్పుడు కూతురైంది అని చెప్పినట్టున్నాడు. నాగార్జున గ్రేట్ కదా!