నాగార్జున కన్‌ఫామ్‌ చేసేశాడు

By iQlikMovies - June 22, 2018 - 18:16 PM IST

మరిన్ని వార్తలు

నాని, నాగార్జున కాంబినేషన్‌లో మల్టీ స్టారర్‌ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శ్రీరామ్‌ ఆదిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. శ్రీరామ్‌ ఆదిత్య సినిమాలంటేనే ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఎక్కువ స్కోపుంటుంది. అందులోనూ నాని, నాగ్‌ వంటి స్టార్స్‌తో అంటే ఆ డోస్‌ మరింత ఎక్కువే ఉంటుందని భావించొచ్చు. 

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా వివరాల్లోకి వెళితే, చాలా సరదా సరదాగా ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోందట. ఈ సందర్భంగా నాగార్జున ఈ సినిమాలో తమ క్యారెక్టర్స్‌ని రివీల్‌ చేసేశాడు. నాని, నాగ్‌ క్యారెక్టర్స్‌ విషయంలో ఇంతవరకూ ప్రచారమవుతున్న టాక్‌ కరెక్టే. నాని ఈ సినిమాలో డాక్టర్‌గా నటిస్తున్నాడట. నాగార్జునది గ్యాంగ్‌స్టర్‌ పాత్రట. నాగార్జునే ఈ విషయాన్ని స్వయంగా కన్‌ఫామ్‌ చేశాడు. కొత్త డైరెక్టర్స్‌నీ, యంగ్‌ అండ్‌ డైనమిక్‌ డైరెక్టర్స్‌నీ ఎంకరేజ్‌ చేయడంలో నాగార్జున ముందుంటాడు. అలాగే శ్రీరామ్‌ ఆదిత్య చెప్పిన ఈ మల్టీ స్టారర్‌ స్టోరీకి అలాగే ఇన్‌స్పైర్‌ అయ్యాడట. వెంటనే ఓకే చేసేశాడట. 

సెట్స్‌లో చాలా ఎంజాయ్‌ చేస్తున్నామనీ, సినిమా రిలీజయ్యాక ఆడియన్స్‌ కూడా అంతే ఎంజాయ్‌ చేస్తారనీ సినిమా గురించి నాగార్జున ముచ్చటించారు. ఇంకా టైటిల్‌ కన్‌ఫామ్‌ చేయలేదు. కానీ ఓ క్రేజీ టైటిల్‌ని ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారనీ తెలుస్తోంది. 'ఆఫీసర్‌' తర్వాత నాగార్జున, 'కృష్ణార్జున యుద్ధం' సినిమా తర్వాత నాని నటిస్తున్న చిత్రమిది. 

ఇద్దరికీ ఈ సినిమా మంచి విజయం అవుతుందని చిత్ర యూనిట్‌ నమ్మకంగా చెబుతోంది.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS