నాగార్జున 'బంగార్రాజు'ను వదల్లేదుగా.!

By iQlikMovies - August 02, 2018 - 13:58 PM IST

మరిన్ని వార్తలు

అక్కినేని నాగార్జున హీరోగా, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా కళ్యాణ్‌కృష్ణ తెరకెక్కించిన 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ జనరేషన్‌తో పాటు, పాత జనరేషన్‌ ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఎంతగానో ఆదరించారు. నాగార్జున డ్యూయల్‌ రోల్‌ పోషించిన ఈ సినిమాకి 'బంగార్రాజు' టైటిల్‌తో సీక్వెల్‌ రూపొందించాలని నాగార్జున అనుకుంటున్నారు. అయితే ఇంతవరకూ కుదరలేదు. దాంతో ఈ ప్రాజెక్ట్‌ అటకెక్కేసినట్లే అనుకున్నారు. 

కానీ ఇప్పుడు ఈ స్క్రిప్ట్‌పై స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ తీసుకున్నారట నాగార్జున. త్వరలోనే ఈ సినిమాని పట్టాలెక్కించే యోచనలో ఉన్నారట. కళ్యాణ్‌కృష్ణ, రచయిత సత్యానంద్‌ స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నారట. ఇకపోతే నాగార్జున ఈ మధ్య ఫుల్‌ బిజీగా ఉన్నారు. 'ఆఫీసర్‌' సినిమా తర్వాత నాగార్జున తెలుగుతో పాటు, హిందీలోనూ ఓ క్రేజా ప్రాజెక్టును అందుకున్నారు. కరణ్‌జోహార్‌ రూపొందిస్తున్న 'బ్రహ్మాస్త్ర' సినిమాలో నాగ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. 

అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌, అలియా ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్‌తో నాగ్‌ ఇటీవల చాలా బిజీగా గడిపారు. అయితే ఈ సినిమాలో నాగార్జున పాత్ర కేవలం 15 నిమిషాల నిడివి మాత్రమే ఉంటుందట. కానీ కథకి అత్యంత కీలకమట. ఇకపోతే తెలుగులో నానితో నాగార్జున చేస్తున్న సినిమా 'దేవదాస్‌'. ఆధ్యంతం వినోదాత్మకంగా సాగే ఈ చిత్రం దాదాపు షూటింగ్‌ చివరి దశకు చేరుకుందట. నాగ్‌కి జోడీగా ఈ సినిమాలో 'మళ్లీ రావా' ఫేం ఆకాంక్షసింగ్‌ నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS