బిగ్‌బాస్ రియాల్టీ షో ముగింపు దశకు చేరుకుంటోంది. 'చేతులెత్తి దండం పెట్టి' మరీ కంటెస్టెంట్స్‌కి విజ్ఞప్తి చేస్తున్నాడు హోస్ట్ నాగార్జున, వీలైనంత ఎక్కువ ఎనర్జీతో వుండాలనీ, గేమ్ బాగా ఆడాలనీ. కానీ, ఏం లాభం.? అస్సలేమాత్రం ఎనర్జీ లేకుండా ఏదో 'మమ' అన్పించేస్తున్నారు. బిగ్‌బాస్ సెట్‌లో వున్న వెలుగులేవీ కంటెస్టెంట్స్ కళ్ళల్లో కనిపించడంలేదు. నడుపు, నవ్వు.. ఏ ఎమోషన్ అయినా, డ్రమెటిక్‌గానే వుంటోంది. ఆ విషయం నాగార్జునకీ అర్థమయ్యింది గనకనే, వీకెండ్స్‌లో మోటివేషనల్ క్లాసులు ఎక్కువైపోతున్నాయ్.
ఇదిలా వుంటే, చివరి దశకు చేరుకున్నదరిమిలా, మరింత అదనపు జాగ్రత్తలు తీసుకుని, ఫుటేజ్‌ని ఇంకా స్పైసీగా ఎడిట్ చేసి, మంచి ఎపిసోడ్‌ని బుల్లితెర వీక్షకులకు అందించాలనే ప్రయత్నాలు జోరందుకున్నాయని తెలుస్తోంది. కింగ్ నాగ్ ఈ వ్యవహారాల్ని ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షిమస్తున్నాడట. రానున్న రోజుల్లో సెలబ్రిటీల ద్వారా బిగ్‌బాస్‌పై ట్వీట్లు వేయించడంతోపాటుగా, కొన్ని వీడియో బైట్స్ కూడా వారిద్వారా ఇప్పించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. నాగ్ తలచుకుంటే, బిగ్‌బాస్‌కి హైప్ అమాంతం పెరిగిపోతుంది.. కానీ, నాగ్ కూడా ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే, వున్నంతలో తనవంతుగా కష్టపడుతున్నాడు.
ఈ సీజన్ తనకు చాలా చాలా ప్రత్యేకమైదనీ, గతంతో పోల్చితే, ఇంకాస్త ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నాననీ కింగ్ నాగ్ చెబుతుండడం గమనార్హం. నాగ్ ఎనర్జీలో లోటు ఏమీ లేదు. సమస్య ఏదన్నా వుందంటే, అది కంటెస్టెంట్స్ కారణంగా మాత్రమే.