ఈ టైటిల్ చూసి షాక్ అయ్యారా! ఇది నిజమండి.. అయితే ఇది నాగార్జున తాను నటించిన దేవదాస్ గురించి చేసిన వ్యాఖ్య కాదు. తన తండ్రి నటించిన ఎవర్గ్రీన్ చిత్రం దేవదాస్ గురించి...
వివరాల్లోకి వెళితే, దేవదాస్ చిత్రం మొదటసారి తాను 11 ఏళ్ళ వయసులో చూడడం జరిగిందట. ఆ వయసులో సహజంగానే అటువంటి చిత్రం కాని క్లైమాక్స్ గాని అంతగా నచ్చలేదట. అయితే దాసరి గారితో మజ్ను చిత్రం చేసే సమయంలో మాత్రం ఆయన సూచన మేరకు మరోసారి దేవదాస్ చూసారట నాగార్జున.
ఈసారి మాత్రం దేవదాస్ చిత్రం విపరీతంగా నచ్చడం, మజ్ను సినిమాలో పాత్ర కూడా దేవదాస్ కి పోలీ ఉండడం బాగా కలిసొచ్చాయి అని చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా ఆయన చేసిన దేవదాస్ చిత్రం మాత్రం మొత్తం నవ్వులతో నిండిపోతుంది అని అందరికి హామీ ఇచ్చేస్తున్నాడు నాగ్.
చూద్దాం.. ఈ దేవ్-దాస్ లు ప్రేక్షకులని ఎలా నవ్వించబోతున్నారో అని...