'అన్నమయ్య' సినిమాలోని పాటలన్నీ అన్నమాచార్య కీర్తనల్లో అందరికీ పరిచయం ఉన్నవే. వాటిని కీరవాణిగారు తమ సంగీత అనుభవంతో పాటలుగా మరింత మధురంగా తీర్చి దిద్దారు. కానీ 'ఓం నమో వేంకటేశాయ'లోని పాటలు అలా కాదు. అన్నీ కొత్తగా ఉంటాయి. అలాగే క్యారెక్టర్లు కూడా చాలా కొత్తగా ఉంటాయి. ఇక నా గెటప్ అంటారా? అందులోనూ, ఇందులోనూ నేనే కాబట్టి గెటప్ ఒకే రకంగా ఉండొచ్చు. కానీ కాన్సెప్ట్ పూర్తి భిన్నంగా ఉంటుంది అంటున్నారు నాగార్జున. అలాగే 'అన్నమయ్య' చేసేటప్పటికీ, ఇప్పుడు హథీరామ్ బాబా గెటప్‌కీ నటన పరంగా నాలో చాలా మార్పులు వచ్చాయి. చాలా అనుభవం వచ్చింది అంటూ ఆయనే స్వయంగా చెబుతున్నారు. 'అన్నమయ్య' సినిమా టైంలో ఆ పాత్ర కోసం చాలా కష్టపడ్డాను. ఆ సినిమా చేసిన ఎక్స్‌పీరియన్స్ ఈ సినిమాకి కొంత ఉపయోగపడింది. కష్టం అయితే అలాగే ఉందంటున్నారు. అంతేకాదు దర్శకేంద్రుడు లాస్ట్ సినిమాగా చెబుతున్నారు ఈ సినిమాని. అందుకే ఈ సినిమా విషయంలో మరింత జాగ్రత్త తీసుకున్నారు ఆయన. అనుష్క పాత్రను తీర్చి దిద్దిన విధానం చాలా బాగుంటుందట. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో అనుష్క ఈశ్వరమ్మగా చాలా ఎట్రాక్ట్ చేస్తోంది. అలాగే మరో ముద్దుగుమ్మ ప్రగ్యా జైశ్వాల్‌కు కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. గ్రాఫిక్స్ పరంగా కూడా ఈ సినిమా చాలా ఘనంగా ఉంటుంది. విజువల్‌గా ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తుందట. ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.