ఇండస్ట్రీలో ఓ హీరో చేయాల్సిన సినిమా మరో హీరో దగ్గరకు వెళ్లడం చాలా కామన్‌గా జరిగే విషయం. కథలు చేతులు మారడం సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాం. రవితేజ క్రాక్ సినిమా... రామ్ చేయాల్సింది. కానీ కుదర్లేదు. ఇప్పుడు నాగార్జున చేయాల్సిన సినిమా రవితేజ దగ్గరకు వచ్చింది. అదే రామారావు ఆన్ డ్యూటీ.
శరత్ మాండవ దర్శకత్వం వహించిన సినిమా ఇది. రవితేజ హీరోగా నటించాడు. ఈ సినిమా కథ ముందు నాగార్జున దగ్గరకు వెళ్లింది. నాగార్జునకు అత్యంత ఆప్తుడైన కామాక్షి మూవీస్ అధినేత శివ ప్రసాద్ రెడ్డి కీ, శరత్ కీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ చొరవతో ఈ కథని... నాగార్జున దగ్గరకు తీసుకెళ్లారు.
నాగ్ కి కూడా ఈ కథ బాగా నచ్చింది. కానీ అప్పట్లో ఆయనకున్న కమిట్‌మెంట్స్ వల్ల కుదర్లేదు. ఆయనే శరత్ కి ఓ సలహా ఇచ్చార్ట. ``ఈ పాత్రకు నాకంటే.. కాస్త వయసు తక్కువున్న హీరో అయితే బాగుంటారు. వాళ్లని ట్రై చేయ్...`` అన్నార్ట. ఆ తరవాత.. ఈ కథని రవితేజకు వినిపించడం, రవితేజ ఓకే చెప్పడం జరిగిపోయాయి. నాగార్జున గనుక ఈ కథని ఓకే చేసి ఉంటే... `నాగేశ్వరరావు ఆన్ డ్యూటీ` అని టైటిల్ పెట్టేవారేమో...?