బుల్లితెర బిగ్‌బాస్ సీజన్ 3కి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే ఇప్పుడు నాగార్జునకు తంటా తెచ్చి పెట్టింది. సోషల్ మీడియాలో నాగార్జునను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ ఆట ఆడేసుకుంటున్నారు. హోస్టింగ్ విషయంలో ఎన్టీఆర్‌తో నాగార్జునను పోల్చుతూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. స్టార్‌డమ్ విషయంలోనూ ఎన్టీఆర్‌తో, నాగార్జునను పోల్చుతున్నారు. కానీ, ఈ పోలిక సబబు కాదు. స్టార్‌గా సుదీర్ఘ కాలం అనుభవం ఉంది నాగార్జునకు.
ఇక బిగ్‌బాస్ హోస్ట్‌గా అంటారా.? షో స్టార్టింగ్‌లోనే నాగార్జున ఎన్టీఆర్‌ని 'నా పెద్దబ్బాయ్ తారక్' అని సంబోధించి, ఆయన ప్రస్థావన తీసుకొచ్చాడు. అలాగే అఖిల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ ఎన్టీఆర్‌ని చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించి, 'ఎన్టీఆర్ నుండి నువ్వు చాలా నేర్చుకోవాలి అఖిల్..' అంటూ అఖిల్‌కి సూచించాడు. ఇలా అవకాశమొచ్చినప్పుడల్లా నాగార్జున, ఎన్టీఆర్‌పై తనకున్న గౌరవాన్నీ, అభిమానాన్నీ చాటుకుంటూనే వచ్చాడు. అలాంటిది, షో విషయమై ఎన్టీఆర్‌తో నాగార్జునని పోల్చి అభిమానులు ఇలా రచ్చ చేయడం భావ్యంగా లేదు.
తొలి వారం బిగ్‌బాస్ హోస్ట్‌గా నాగార్జున తనదైన శైలి పర్‌ఫామెన్స్ ఇచ్చాడు. అయితే, ప్రస్తుతం నాగార్జున 'మన్మధుడు 2' సినిమా ప్రమోషన్స్ కూడా చేయాల్సి ఉంది. సో అదీ ఇదీ ఈక్వెల్‌గా మ్యానేజ్ చేయడంలో కొంత ఫోకస్ మిస్ అయితే కావచ్చు కాక, అయినా దానికి తావే లేదు నాగ్‌కి. ఆయనకున్న అనుభవం అలాంటిది. ఆగస్ట్ 9న 'మన్మధుడు 2' రిలీజ్ కావడంతో, ఆ బాధ్యత తీరిపోతుంది నాగ్‌కి. ఇక ఆ పై పూర్తిగా బిగ్‌బాస్ పైనే ఫోకస్ పెట్టనున్నాడట నాగార్జున.