ఉప్పెనతో ఒక్కసారిగా సునామీలా విరుచుకుపడ్డాడు వైష్ణవ్ తేజ్. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా రూ.50 కోట్ల క్లబ్ లోనూ చేరింది. ఆ వెంటనే.. వైష్ణవ్ కి అవకాశాలు వరుసకట్టాయి. ఉప్పెన కంటే ముందు క్రిష్ సినిమాలో హీరోగా ఫిక్సయ్యాడు. ఆ వెంటనే అన్నపూర్ణ బ్యానర్ లో, నాగార్జున నిర్మాతగా ఓ సినిమా చేయడానికి సంతకాలు చేశాడు. ఈ చిత్రంతో పృథ్వీ అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కథ సిద్ధమైంది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.
ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాకి గానూ వైష్ణవ్ రూ 5 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడట. తొలి సినిమాకి కేవలం 50 లక్షల పారితోషికం తీసుకున్నాడు వైష్ణవ్. ఆ తరవాత... సినిమా 50 కోట్లు అందుకోవడంతో వైష్ణవ్ కి అదనంగా పారితోషికం ఇచ్చింద మైత్రీ మూవీస్. క్రిష్ సినిమాకి 2 కోట్ల పారితోషికం అందుకున్న వైష్ణవ్.. మూడో సినిమాకి 5 కోట్ల రేంజ్ కి చేరాడు. ఈ సినిమా కూడా హిట్టయితే.. వైష్ణవ్ రూ.10 కోట్ల హీరో అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.