చాలా అంచనాల మధ్య వచ్చాడు అక్కినేని అఖిల్. అయితే ఆ అంచనాలు తగ్గట్టు ఎప్పటికీ సరైన విజయం దక్కలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పర్వాలేదనిపించినా అఖిల్ కోరుకునే మాత్రం రాలేదు. ఇప్పుడు సురేందర్ రెడ్డితో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా దిన్ని తయారు చేస్తున్నారు. ఇప్పటికే టీజర్ ని వదిలారు. టీజర్ లో సురేందర్ రెడ్డి మార్క్ యాక్షన్ కనిపించింది. తర్వాత సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. దీనికి కారణం.. అవుట్ పుట్ తో సురేందర్ రెడ్డి హ్యాపీగా లేడు. నాగార్జున కూడా రసష్ చూసి కాస్త నిరాశ చెందారని తెలిసింది. ప్రస్తుతం చాలా ఎపిసోడ్స్ ని రీ షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా బడ్జెట్ విషయంలో కూడా లెక్క తప్పింది. అనుకున్న బడ్జెట్ కి రెండింతలైయింది. అఖిల్ కి ఎంత మార్కెట్ వుందో క్లారిటీ లేదు. కానీ ఏజెంట్ కోసం లెక్కకు మించి ఖర్చయిపోతుంది. ఈ ఖర్చు సినిమా కోసం అయితే ఓకే. కానీ ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం వలన జరిగే వృదా ఖర్చు ఎక్కువౌతుందని అటు నిర్మాతల్లో కూడా అసహనం వచ్చేసింది. పైగా ఇప్పటికే సినిమా చాలా ఆలస్యమైయింది. ఈ సినిమా మొదలైనప్పుడు నాగార్జున చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. అఖిల్ కి ఏజెంట్ మంచి బూస్ట్ ఇచ్చే సినిమా అవుతుందని. కానీ ఇప్పుడు ఏజెంట్ తయారౌతున్న విధానం చూసి నమ్మకాలల్ని వదులుకుంటున్నారని టాక్.