టాలీవుడ్ మన్మధుడు నాగార్జున. అందంలో యంగ్ హీరోస్ సైతం ఆయనకి పోటీ కాలేరు. చివరికి ఆయన కొడుకులు కూడా. అలాంటిది వర్మ సినిమా కోసం నాగార్జున తన ఏజ్ పెంచేసుకున్నట్లుగా కనిపిస్తున్నాడు. మెరిసిన జుట్టుతో డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ - నాగార్జున కాంబినేషన్లో చాలా కాలం తర్వాత తెరకెక్కుతోన్న సినిమా ఈ రోజే లాంఛనంగా స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఓ చేతిలో గన్, మరో చేతిలో నోట్ల కట్టలు, కళ్లల్లో రౌద్రంతో నాగ్ ఆకట్టుకుంటున్నాడు.
అయితే అమ్మాయిలకు ఈ లుక్‌లో నాగ్ని ఊహించుకోవడమే చాలా కష్టం. అలాంటిది స్క్రీన్‌పై మన్మధున్ని ఇలా ఎలా రిసీవ్ చేసుకుంటారో. ఓ టేబుల్‌పై గన్, పోలీస్ టోపీ, టీ గ్లాస్‌తో ఉన్న ఓ పోస్టర్, మెరిసిన జుట్టుతో నాగ్ కసిగా చూస్తున్న ఓ పోస్టర్, ఇలా కొన్ని పోస్టర్స్ విడుదల చేశారు. అన్నింట్లోనూ నాగ్ని కోపంగానే చూపించారు. ఈ సినిమాలో నాగార్జున పవర్ ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్స్ చూస్తుంటే, ఆ గెటప్ వెరీ వెరీ పవర్ ఫుల్ అని తెలుస్తోంది. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. యాక్షన్ ఘట్టాలకు అత్యంత ప్రాధాన్యత ఉండబోతోది.
'సోగ్గాడే చిన్ని నాయానా' అంటూ అమ్మాయిల మనసుల్ని కొల్లగొట్టి, 'రాజుగారి గది - 2' వంటి హారర్ కామెడీ చిత్రం అయినా యూత్‌కి ఇన్స్పిరేషన్ క్యారెక్టర్లో నటించి, నాగార్జున ఇప్పుడు ఇంత పవర్ ఫుల్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు. పవర్ ఫుల్ అంటే, ఇంతవరకూ ఇలాంటి క్యారెక్టర్లో నాగార్జునని చూడనేలేదు. ఈ సినిమా స్టోరీ ఎంగానో నచ్చేసి ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాడట. వర్మ - నాగ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న నాలుగో చిత్రమిది. భారీ అంచనాలున్నాయి ఈ సినిమాపై.