మన్మధుడంటే మన్మధుడే.!

By iQlikMovies - March 09, 2018 - 19:40 PM IST

మరిన్ని వార్తలు

ఫోటో చూశారా? ఫోటోలో ఉన్నది టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జున. ఆ పక్కనే మన్మధుడి గ్లామర్‌కి ఏమాత్రం తీసిపోనట్లున్న ముద్దుగుమ్మ పేరు మిరా సరీన్‌. వర్మ కంపెనీ నుండి పరిచయం అవుతున్న బ్యూటీ ఈ ముద్దుగుమ్మ. నాగార్జున - వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'ఆఫీసర్‌' సినిమా కోసం ఈ ముద్దుగుమ్మని తీసుకొచ్చాడు వర్మ. 

వర్మ హీరోయిన్‌ అంటే ప్రత్యేకమే కదా మరి. అలాగే ఈ ముద్దుగుమ్మలోనూ చాలా స్పెషాలిటీస్‌ ఉన్నాయి. ఆ సంగతి అటుంచితే, మన టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జున గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే అవుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఎంతటి వారిలోనైనా ఎక్కడోచోట ఆ ఛాయలు కనిపిస్తాయి. కానీ వయసుతో పాటు, మన మన్మధుడికి అందం కూడా పెరుగుతూ వస్తోంది. సినిమా సినిమాకీ అందం పెంచుకుంటూ పోతున్నాడు. అప్పటికీ ఇప్పటికీ, ఎప్పటికీ అమ్మాయిలకు తనపై ఉన్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గట్లేదంటే, అందుకు కారణం నాగ్‌లోని ఆ హ్యాండ్‌సమ్‌ లుక్స్‌. ఆకట్టుకునే ఫిజిక్‌.

హీరోలుగా హ్యాండ్‌సమ్‌ సన్స్‌ (చైతూ, అఖిల్‌) ఇద్దరున్నా, వారిరువురూ కూడా తండ్రి నాగార్జున అందంతో కాసింతైనా పోటీ పడలేకపోతున్నారు. అదీ నాగార్జున అంటే. అందుకే ఎప్పటికీ నాగార్జున మన్మధుడే. తాజాగా 'ఆఫీసర్‌' సినిమా నుండి విడుదలైన ఈ స్టిల్‌ మరింత ఆశక్తిని రేకెత్తిస్తోంది. ఓ పాపని కాపాడే నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాగార్జున పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో నటిస్తున్నాడు. సిక్స్‌ ప్యాక్‌ కాకపోయినా, అంతకు ఏమాత్రం తీసిపోని ఫిట్‌ బాడీతో నాగార్జున ఈ స్టిల్‌ సింప్లీ సూపర్బ్‌ అంతే!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS