బిగ్ బాస్ ప్రేక్షకులు...వారమంతా కంటెస్టెంట్లు చేసే ఓవర్ యాక్షన్ ను తట్టుకుని ఎలిమినేషన్ డే కి హోస్ట్ 'నాగార్జున' ఎవరిని ఎలిమినెట్ చేస్తాడా, ఎవరికీ వార్నింగ్ ఇస్తాడా అని ఆతృత గా ఎదురు చూస్తూ టీవీలకు అతుక్కుపోతారు. అలాగే నిన్న 'ఆశు రెడ్డి' ఎలిమినేషన్ ను ముందే పసిగట్టినా..
ఇతర కంటెస్టెంట్స్ గురించి ఎం చెప్తారా అని వెయిట్ చేశారు. అయితే నాగార్జున ఏ ట్విస్టులు లేకుండా చాలా నార్మల్ గా 'ఆశు' ఎలిమినేషన్ ను ప్రకటించాడు. అంతేకాకుండా కొన్ని ఊహించని తప్పులు కూడా చేసాడు. అవేంటంటే... హౌస్ లో 'శ్రీ ముఖి' పదే పదే అనవసరంగా 'మహేష్' పుల్లలు పెడుతున్నాడని..'అలీ' మరియు 'మహేష్' గొడవపడితే 'బాబా' ఆపే ప్రయత్నం చేయలేదని.. మరియు ఇతర ఇంటి సభ్యులను రెచ్చ గొట్టడం క్లియర్ గా కనిపిస్తున్నా..నాగార్జున మందలించలేదు.
అంతే కాకుండా, ఎప్పుడూ కూల్ గా ఉండే 'అలీ' ని ఏటిట్యూడ్ తగ్గించుకోమన్నాడు కానీ ఎప్పుడూ ఏటిట్యూడ్ చూపించే 'పునర్నవి'కి మాత్రం ఏమి చెప్పలేదు. ఇకపోతే 'మహేష్' పుల్లలు పెడతాడని హౌస్ సభ్యులందరూ నోరు పారేసుకుంటున్నా, ఆలా అనకూడదు అని వార్న్ కూడా చేయలేదు. మొత్తానికి గత హోస్టులు ఇచ్చిన కిక్ 'కింగ్ నాగ్' ఇవ్వలేకపోతున్నాడని బిగ్ బాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.