'వాల్మీకి'గా వరుణ్ తేజ్ మేకోవర్ గురించే మాట్లాడుకున్నాం ఇంతవరకూ. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్దే నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, పూజా హెగ్దేని డైరెక్ట్‌గా ఇంతవరకూ రివీల్ చేయలేదు డైరెక్టర్ హరీష్ శంకర్. మొన్నా మధ్య వెనక నుండి చూపించి ఆమె ముఖాన్ని దాచేశాడు. ఇదిగో ఇక దాచడం సబబు కాదనుకున్నాడో ఏమో, ఫ్రంట్ నుండి పూజా హెగ్దే లుక్ రివీల్ చేసి, ఫ్యాన్స్‌కి అదిరిపోయే షాకిచ్చాడు హరీష్ శంకర్.
గతంలో 'డీజె' సినిమా కోసం పూజా హెగ్దే, హరీష్ శంకర్‌తో పని చేసిన సంగతి తెలిసిందే. పూజా హెగ్దేలోని అపారమైన గ్లామర్ యాంగిల్‌కి గేట్లు తెరిచిన ఘనత 'డీజె' సినిమాతోనే దక్కింది హరీష్ శంకర్‌కి. ఆ సినిమా హిట్ కాలేదు కానీ, హరీష్ పుణ్యమా అని, పూజా హెగ్దే టాప్ ఛైర్‌ని అధిరోహించే స్టార్‌డమ్‌కి చేరుకుంది. స్టార్ హీరోలందరి సరసనా వరస ఆఫర్లు దక్కించుకుంది. ఇప్పుడు హరీష్ శంకర్ కోసమే 'వాల్మీకి' సినిమా ఒప్పుకుంది. ఇక తాజాగా ఈ సినిమా నుండి రివీల్ అయిన లుక్ విషయానికి వస్తే, ఈ సారి పూజా అందాల్ని దాచేశాడనిపిస్తోంది డైరెక్టర్.
పూర్తిగా పల్లెటూరి అమ్మాయిలా మార్చేవాడు పూజాని. రిబ్బన్లు అల్లిన రెండు జడలు, చేతులకు గాజులు, కాళ్లకు పట్టీలు, అమాయకత్వం నిండిన ముఖం.. ఇదీ ఇప్పుడు 'వాల్మీకి'లో పూజా గెటప్. మాస్‌ని ఆకట్టుకునేలా ఉంది ఈ లుక్. ఈ లుక్‌లో పూజా సైకిల్ తొక్కుకుంటూ వస్తున్న స్టిల్‌ని తాజాగా వదిలారు. ఈ లుక్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే, పూజా నుండి గ్లామర్ ఎక్స్‌పెక్ట్ చేసిన వాళ్లు ఈ లుక్‌తో శాటిస్‌ఫై అవుతారా.? చూడాలి మరి. సెప్టెంబర్‌లో 'వాల్మీకి' ప్రేక్షకుల ముందుకు రానుంది.