టాలీవుడ్ లో సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు నిలవగా రెండు విజయం సాధించి, వసూళ్లు సాదిస్తున్నాయి. వీటిలో హానుమాన్ మూవీ ఒకటి. నా సామిరంగా మూవీ ఒకటి. నాగార్జున మరోసారి సంక్రాతి హీరో అని నిరూపించుకున్నారు. విడుదలైన మూడో రోజు కూడా 'నా సామి రంగ' సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో, రెండు రోజుల్లో 8.88 కోట్ల షేర్ కలెక్ట్ చేసి, మూడో రోజు 3.58 కోట్లు వసూలు చేసింది. మూడో రోజు కూడా ఏ మాత్రం తగ్గకుండా హౌస్ ఫుల్ కలక్షన్స్ తో, రికార్డ్ క్రియేట్ చేసింది.
తెలంగాణ 1.05 కోట్లు, రాయలసీమ 60 లక్షలు, ఉత్తరాంధ్ర 51 లక్షలు, ఈస్ట్ గోదావరి 44 లక్షలు. వెస్ట్ గోదావరి 22 లక్షలు, కృష్ణ 24 లక్షలు, గుంటూరు 34 లక్షలు, నెల్లూరు 18 లక్షలు వచ్చాయి. ఆదివారం విడుదలైన 'నా సామి రంగ' సినిమాకు మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. మొదటి రోజు 4.33 కోట్ల షేర్ రాగా, సోమవారం 4.55 కోట్ల షేర్ వచ్చింది. మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో12.46 కోట్లు వచ్చాయి. గ్రాస్ కలెక్షన్స్ చూస్తే, వరల్డ్ వైడ్ 24.8 కోట్లు కలెక్ట్ చేసింది.
'నా సామి రంగ' డిజిటల్ & శాటిలైట్ రైట్స్ 'డిస్నీ ప్లస్ హాట్‌స్టార్', 'స్టార్ మా' సొంతం చేసుకున్నాయి. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా సినిమాకు సుమారు 33 కోట్లు రాగా, థియేట్రికల్ రైట్స్ 18.5 కోట్లకు ఇచ్చేశారు. ఇప్పటికే 12.8 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. మరో మూడు నాలుగు రోజుల్లో మిగతా అమౌంట్ కలక్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.