నాగార్జున సెంచరీ మైలు రాయికి దగ్గర పడ్డారు. ఇప్పుడు ఆయన ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమా చేస్తున్నారు. సంఖ్యా పరంగా అది 99వ చిత్రం. అంటే మరో సినిమా చేస్తే... వందన్నమాట. ఈ సినిమాకి సంబంధించిన కథ కూడా ఆల్రెడీ రెడీ అయిపోయిందని టాక్. 100 వ సినిమా కాబట్టి, ప్రత్యేకంగా ఉండాలని నాగ్ భావిస్తున్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా (చిరుతో గాడ్ ఫాదర్ ఫేమ్) ఇప్పటికే నాగ్ కి ఓ కథ వినిపించారని, దాన్ని నాగ్ లాక్ చేశారని సమాచారం.
ఇదో మల్టీస్టారర్ అని, రెండో హీరోగా అఖిల్ పేరు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఈసినిమా బడ్జెట్ దాదాపు 100కోట్లట. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. నాగ్ పై 100 కోట్లంటే చాలా కష్టమే. ఎంత అఖిల్ ఉన్నా, అది నాగ్ సినిమాగానే చలామణీ అవుతుంది. నాగ్ సినిమా సూపర్ డూపర్ హిట్టయితే అన్ని వైపుల నుంచి రూ.50 కోట్లు సాధిస్తుంది. దానికి డబుల్ పెట్టాలని చూస్తున్నాడంటే నాగ్ రిస్క్ తీసుకుంటున్నట్టే లెక్క.