నాగార్జున మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఓకే అయ్యిందా?

మరిన్ని వార్తలు

అక్కినేని నాగార్జున ప్రస్తుతం కొంచెం స్లో అయ్యారు. తన తోటీ హీరోలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తూ, హిట్లు కొడుతుంటే నాగ్ మాత్రం మల్టీస్టారర్, గెస్ట్ రోల్స్ చేస్తూ కెరియర్ లో కొంచెం వెనకపడ్డారు. నా సామి రంగా సినిమా తరువాత నాగ్ నుంచి సోలో మూవీ రాలేదు. ప్రస్తుతం నాగ్ 'కుభేర‌', 'కూలీ' సినిమాల్లో నటిస్తున్నాడు. కుబేర మూవీ శేఖర కమ్ముల దర్శకత్వంలో తెరెకెక్కుతోంది. ధనుష్ మెయిన్ లీడ్ చేస్తుండగా, నాగ్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. కోలీవుడ్ లో లోకేష్ కనక రాజ్ తెరకెక్కిస్తున్న రజనీ కాంత్  'కూలి' మూవీలో కూడా నాగ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

బాలీవుడ్ మూవీ 'మున్నాభాయి' సిరీస్ లో నాగ్ ఒక కీ రోల్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా అన్ని మల్టీ స్టారర్ ఒప్పుకుంటున్నారు. సోలోగా వెనక్కి తగ్గారు. బాలయ్య, చిరంజీవి, వెంకటేష్ అప్పుడే వందలకోట్లు క్లబ్ లో చేరారు. నాగ్ ఖాతా ఎప్పుడు తెరుస్తారా అని చూస్తున్నారు అక్కినేని ఫాన్స్. ఇప్పడు ఆ టైం వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం విశ్వంభర మూవీతో బిజీగా ఉన్న వశిష్ఠ మల్లిడి నాగ్ కోసం ఒక కథ సిద్ధం చేసినట్లు, ఇప్పటికే నాగ్ కి ఆ కథ వినిపించినట్లు తెలుస్తోంది. తాజాగా అన్న‌పూర్ణ స్టూడియోస్ లో నాగార్జున‌తో వ‌శిష్ట భేటీ అయినట్లు తెలుస్తోంది.

పాన్ ఇండియా కథతో రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలకి విరుద్ధంగా ఈ మూవీ ఉండనున్నట్లు సమాచారం. నాగ్ కి కూడా కథ నచ్చింది అని, కాకపొతే కుభేర, కూలి సినిమాల రిలీజ్ తరువాత నాగ్ ఈ మూవీ పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నారట. నాగ్ కెరియర్ లో సోలో పాన్ ఇండియా మూవీ ఇదే. వశిష్ట ఇప్పటికే బింబిసారా మూవీతో ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. వెంటనే చిరుతో కలిసి వర్క్ చేసే ఛాన్స్ అందుకున్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్ వశిష్టని స్టార్ డైరక్టర్ ని చేసాయి. ఇప్పడు నాగ్ తో సినిమా చేసి హిట్ కొడితే వశిష్ట కెరియర్ కి ఇక తిరుగుండదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS