నాగ్‌ చాలా పెద్ద షాక్‌ ఇచ్చాడుగా!

మరిన్ని వార్తలు

అక్కినేని నాగార్జునని అభిమానులు ముద్దుగా 'మన్మధుడు' అని పిలుచుకుంటారు. వయసు అనేది ఆయన హ్యాండ్సమ్‌ లుక్‌కి ఏనాడూ అడ్డంకి కాలేదు. నాగార్జున కుమారులు నాగచైతన్య, అఖిల్‌ హీరోలుగా సినిమాలు చేస్తున్నా, అక్కినేని నాగార్జున మాత్రం ఇంకా తన కుమారులతో ఫిట్‌నెస్‌ పరంగా పోటీ పడుతుండడం గమనించదగ్గ అంశం. 

ఫిట్‌నెస్‌ విషయంలో నాగార్జున తర్వాతే ఎవరైనా. అలాంటి నాగార్జున, ఒక్కసారిగా పెన్షన్‌ తీసుకునే ఏజ్‌కి వెళ్ళిపోతే.! రియల్‌ లైఫ్‌ ఏజ్‌ సంగతి పక్కన పెడితే, రీల్‌ లైఫ్‌లో నాగార్జున పెన్షనర్‌గా నటించారు. అదీ ఓ కమర్షియల్‌ యాడ్‌ కోసం. ఆ యాడ్‌లో మనవరాలితో బ్యాంక్‌కి వెళ్ళి తన అకౌంట్‌లో అదనంగా పడిన పెన్షన్‌ సొమ్ముని తిరిగిచ్చేయడానికి ఓ వృద్ధుడు పడే ఆవేదన, ఈ క్రమంలో అతని నిజాయితీ అద్భుతం అనే చెప్పక తప్పదు. ఈ కమర్షియల్‌లో నాగ్‌ లుక్‌ చాలామందికి షాక్‌ ఇచ్చింది. 

కమర్షియల్‌ యాడ్‌ చూసినవారంతా, అక్కడున్నది నాగార్జునేనా? అని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత తేరుకుని, వావ్‌ నాగార్జున అదరగొట్టేశాడని అనుకున్నారు. కొన్ని సినిమాల్లో నాగార్జున ఓల్డ్‌ లుక్‌లో కన్పించినా, టీవీ కమర్షియల్స్‌లో ఇలా నాగ్‌ ఓల్డ్‌ లుక్‌తో కన్పించడం ఇదే తొలిసారి అనుకోవచ్చేమో. 

మామూలుగా అయితే ఇలాంటి గెటప్‌ని ఎవరూ సాహసించరు. అందుకే నాగ్‌ చాలా చాలా ప్రత్యేకం. ఊరికే నాగ్‌ 'కింగ్‌' అయిపోలేదు అభిమానుల దృష్టిలో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS