కేజీఎఫ్‌లో రావు ర‌మేష్ పాత్రేమిటి?

By Gowthami - February 12, 2020 - 15:30 PM IST

మరిన్ని వార్తలు

క‌న్న‌డ చిత్రం `కేజీఎఫ్‌` దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన ఈ సినిమా - బాక్సాఫీసు ద‌గ్గ‌ర వ‌సూళ్ల వ‌ర్షం కురిపించుకుంది. ఇప్పుడు కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 సెట్స్‌పై ఉంది. ఈ సినిమాపై కూడా భారీ అంచ‌నాలున్నాయి. దేశం మొత్తం ఈ సినిమా కోసం ఎదురుచూస్తోంది. దానికి త‌గ్గ‌ట్టే స్టార్ కాస్టింగ్‌తో చాప్ట‌ర్ 2కి బాగానే మెరుగులు దిద్దుతున్నాడు. తెలుగు నుంచి ఓ కీల‌క‌మైన పాత్ర కోసం రావు ర‌మేష్‌ని ఎంచుకున్నారు. రావు ర‌మేష్ ఈ సినిమాలో రాఖీ భాయ్ తండ్రిగా క‌నిపిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

నిజానికి ఈ సినిమాలో రావు ర‌మేష్ ఓ సీబీఐ ఆఫీస‌రుగా న‌టించ‌బోతున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం రావు ర‌మేష్ - ర‌వీనా టాండ‌న్‌ల‌పై కీల‌క‌మైన స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజ‌య్‌ద‌త్ ఓ కీల‌క‌మైన పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ యేడాది వేస‌విలో ఈచిత్రాన్ని విడుద‌ల చేస్తారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS