నాగ్ ప‌ని మొద‌లెడుతున్నాడు

By Gowthami - June 16, 2021 - 13:00 PM IST

మరిన్ని వార్తలు

మెల్ల‌మెల్ల‌గా లాక్ డౌన్ బంధ‌నాలు తెర‌చుకుంటున్నాయి. షూటింగుల‌కు మార్గం సుగ‌మం అవుతోంది. ఇప్ప‌టికే కొన్ని సినిమాలు సెట్స్‌పైకి వెళ్లిపోయాయి. ప‌రిమిత సిబ్బందితోనే షూటింగులు చేసుకుంటున్నాయి. పెద్ద సినిమాలూ ఇప్పుడు `యాక్ష‌న్‌.. క‌ట్` చెప్ప‌డానికి రెడీ అవుతున్నాయి. అగ్ర క‌థానాయ‌కుడు నాగార్జున కూడా త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి అడుగుపెట్ట‌బోతున్నారు.

 

నాగార్జున క‌థానాయ‌కుడిగా ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. గోవాలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. వ‌చ్చే నెల‌లో ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్ లో మొద‌లుకానుంది. ఈ సినిమా లో నాగార్జున రా ఏజెంట్ గా క‌నిపించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. క్రావ్ మాగా, స‌మురై స్వార్డ్ అనే యుద్ధ విద్య‌లు నేర్చుకుంటున్నాడ‌ట‌. ఈ చిత్రంలో యాక్ష‌న్‌కి స‌ముచిత స్థానం ఉంద‌ని, అందుకే వీటిపై నాగ్ క‌స‌ర‌త్తు చేస్తున్నాడ‌ని స‌మాచారం. ఈ యేడాదిలోనే ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS