కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న రాజు గారి గది 2 చిత్రానికి సంబందించిన రిలీజ్ తేది బయటకి వచ్చింది.
ఇప్పటికే షూటింగ్ ముగించుకుని, నిర్మాణంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రాన్ని ఆగష్టు 25న విడుదల చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. నిర్మాణ సంస్థలైన పీవీపీ-మ్యాటినీ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ఆగష్టు నెల అయితేనే బాగుంటుంది అని ఆలోచిస్తున్నట్టు సమాచారం.
ఈ రోజుల్లో రిలీజ్ డేట్ ని ఒక నెల ముందే ప్రకటించడం అనే ట్రెండ్ నడుస్తున్న నేపధ్యంలో వీరు ఈ ఆలోచన చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో నాగార్జున తో పాటుగా ఆయనకి కాబోయే కోడలు సమంతా కూడా ఓ ప్రత్యేక పాత్రలో మేరవనుంది.
అయితే ఒకటి రెండు రోజుల్లో ఈ రిలీజ్ కి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.