నాగార్జున ఈ మధ్య హీరోగానే కాకుండా మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కనిపించడానికే మొగ్గు చూపుతున్నాడు. అందులో భాగంగానే ఆయన ఇప్పటివరకు తన కెరీర్ లో చేయని పాత్ర రాజు గారి గది 2లో చేసాడు.
దీనికి సంబందించిన ఒక లుక్ ఇప్పటికే రిలీజ్ అవ్వగా ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ రేపు అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని విడుదల చేయనున్న సంగతి విదితమే. అయితే తెలియవస్తున్న సమాచారం ప్రకారం ఈ ట్రైలర్ రేపు ఉదయం 10.30లకు విడుదల కానుందట.
ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా చెప్పగా, ఈ చిత్ర యూనిట్ కూడా ఈ విషయాన్ని ద్రువీకరించింది.