'బ్రహ్మాస్త్ర' కోసం నాగ్‌ మొదలెట్టేశాడు

By iQlikMovies - July 16, 2018 - 16:59 PM IST

మరిన్ని వార్తలు

అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. 'బ్రహ్మాస్త్ర' టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. రణ్‌వీర్‌ కపూర్‌, అలియా భట్‌, అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జున ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తున్నాడు. 

గతంలో పలు హిందీ చిత్రాల్లో నటించిన నాగార్జున చాలా కాలం తర్వాత బాలీవుడ్‌లో నటిస్తున్న చిత్రమిది. అమితాబ్‌తో నాగ్‌కి మంచి స్నేహ సంబంధం ఉంది. ఆ స్నేహ బంధంతోనే నాగార్జున నటించిన 'మనం' చిత్రంలో అమితాబ్‌ గెస్ట్‌ రోల్‌ పోషించారు. ఈ ఇద్దరూ కలిసి నటించిన బాలీవుడ్‌ చిత్రాలు చాలానే ఉన్నాయి గతంలో. ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

లేటెస్టుగా నాగార్జున ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత కరణ్‌ జోహర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. 'నాగార్జున రాకతో మా 'బ్రహ్మాస్త్ర' టీమ్‌ ఇంకా పెద్దదైంది. టీమ్‌కి ఇంకా గ్రాండ్‌ లుక్‌ వచ్చింది..' అని ట్వీట్‌ చేశారు. ఇటీవల 'ఆఫీసర్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగార్జున నానితో 'దేవదాస్‌' అనే మల్టీస్టారర్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. దసరాకి 'దేవదాస్‌' ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఓ వైపు తెలుగు సినిమాల్తో బిజీగా ఉంటూనే, బాలీవుడ్‌లోకీ రీ ఎంట్రీ ఇచ్చేశాడు నాగార్జున.
 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS