మరో ప్రయోగానికి నాగ్‌ రెడీ

మరిన్ని వార్తలు

అక్కినేని నాగార్జున ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో దిట్ట. కొత్త దర్శకుల్ని ప్రోత్సహించడంలో ఆయనకి ఆయనే సాటి. ఫ్లాప్‌లు ఎదురొచ్చినా, ప్రయోగాలకు వెనుకాడడు. ఈ అక్కినేని అందగాడు ఇటీవల 'ఆఫీసర్‌'గా కనిపించాడు. అయితే 'ఆఫీసర్‌' నాగార్జునకి చెప్పుకోదగ్గ విజయాన్ని ఇవ్వలేకపోయింది. రామ్‌గోపాల్‌ వర్మ నిరాశపరిచాడు. 

'ఆఫీసర్‌' ఫలితం తేడా కొట్టిందని మళ్లీ కమర్షియల్‌ సినిమాలే చేయాలనుకోవట్లేదు నాగార్జున. కొత్తదనంతో కూడిన సినిమాలు చేయాలన్నదే నాగార్జున ఆలోచన. ఆ ఆలోచనలకు తగ్గట్లే ఓ యంగ్‌ డైరెక్టర్‌ నాగార్జునకు అద్భుతమైన కథ చెప్పాడట. కథ విన్న వెంటనే స్పెల్‌ బౌన్‌ అయిపోయిన నాగార్జున తానే ఆ సినిమాని నిర్మిస్తానని ముందుకొచ్చాడట. నాగార్జున ప్రయోగాత్మక సినిమాలు చేసేటప్పుడు తనే నిర్మాతగా ఉండేందుకు ఇష్టపడతాడు. ఈ విషయంలో నాగార్జునను ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. 

అదలా ఉంచితే, తన కెరీర్‌తో పాటు, కొడుకులు నాగచైతన్య, అఖిల్‌ కెరీర్స్‌ని కూడా నాగ్‌ చాలా జాగ్రత్తగా ప్లాన్‌ చేస్తున్నాడు. సినిమాల ఎంపికలో వారికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నాడు. నాగచైతన్య ట్రాక్‌ ఎక్కేసినా, అఖిల్‌ ఇంకా సరైన హిట్‌ కొట్టలేదు. అక్కినేని అఖిల్‌కి మంచి హిట్‌ వస్తే, నాగార్జునకు పెద్ద టెన్షన్‌ తగ్గిపోయినట్లే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS