బొద్దుగుమ్మ నమిత ఇటీవలే తమిళ డైరెక్టర్ వీరూను పెళ్లాడిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లయ్యాకే ఈ ముద్దుగుమ్మకి తన బొద్దుతనం ఎంత పెద్ద సమస్యనో తెలిసి వచ్చిందట. ఆమె భర్త వీరూ సన్నగా స్లిమ్‌గా ఉంటాడు. దాంతో ఆమెకి స్వీట్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయట. ఎలాగైనా సన్నబడాలని అనుకుంటోందట. వీలైనంత త్వరగా సన్నబడి అభిమానులకు షాక్ ఇస్తానంటోంది ముద్దుగుమ్మ నమిత.
తెలుగులో 'సొంతం', 'జెమిని' తదితర చిత్రాల్లో నటించింది నమిత. అయితే తెలుగులో నటిగా చెప్పుకోదగ్గ స్థాయిలో గుర్తింపు సంపాదించలేకపోయింది. కానీ, తమిళంలోకి వెళ్లాక అక్కడ పాపులర్ నటిగా మారింది. కొంచెం కొంచెం బొద్దుగా మారుతోన్న నమిత అందాలకు తమిళ తంబీలు దాసోహం అన్నారు. తమిళ తంబీలకు బొద్దుగుమ్మలంటే ఉన్న ఇంట్రెస్టే అందుకు కారణం. అలా ఈ ముద్దుగుమ్మ కాస్తా బొద్దుతనాన్ని అలవాటుగా మార్చేసుకుని అక్కడ పాపులర్ హీరోయిన్‌గా సెటిలైపోయింది.
అయితే పెళ్లయ్యాక తెలిసి వచ్చిన తన సమస్యను అధిగమించి, త్వరలోనే సన్నబడిన అందాలతో కిక్ ఇవ్వడానికి సిద్ధపడుతోందట. ఆల్రెడీ నమిత సన్నబడేందుకు కసరత్తులు మొదలెట్టేసిందట. పెళ్లయ్యాక కూడా హీరోయిన్‌గా కొనసాగుతానంటోంది. తమిళంతో పాటు, తెలుగులో కూడా నటించే ఆలోచనతో అందాల నమిత రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి స్లిమ్‌గా ఉన్న నమిత ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందో. రీ ఎంట్రీలో ఎలాంటి అవకాశాలు దక్కించుకుంటుందో!