'సొంతం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ నమిత. మొదట్లో సన్నగా నాజూకు తీగలా మురిపించిన నమిత మెల్ల మెల్లగా బరువు పెరిగింది. ఊహించని ఆ బొద్దుతనంతో తెలుగులో సినిమాలకు దూరమైంది. కానీ తమిళంలో స్టార్‌డమ్ సంపాదించుకుంది. తమిళ తంబీలకు బొద్దు అందాలు ఇష్టమే కాబట్టి, అక్కడ ఫుల్ బిజీ అయిపోయింది నమిత.
మలయాళ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తితో వివాహమైన తర్వాత నమిత ఈ మధ్యనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం తమిళంలో నమిత 'అహంభావం' అనే సినిమాలో నటిస్తోంది. తెలుగు నుండి కూడా ఆఫర్లు వస్తున్నాయి. మలయాళం, కన్నడ నుండీ కూడా మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయట. కానీ అవన్నీ గ్లామర్ రోల్సేనట. ఒకప్పుడు విచ్చలవిడిగా ఎక్స్‌పోజింగ్ చేసి, గ్లామరస్‌గా మెరుపులు మెరిపించిన నమిత పెళ్లి తర్వాత గ్లామర్ రోల్స్‌లో నటించకూడదని పెద్ద డెసిషనే తీసుకుందట.
ఆ క్రమంలోనే డిగ్నిఫైడ్ రోల్స్‌లోనే నటిస్తానంటోంది. విలన్ పాత్రలైనా ఓకేనట. అన్నింటికీ మించి ప్రస్తుతం నమిత ఫిజిక్‌పై దృష్టి పెట్టింది. ఇప్పటికే 10 కేజీల బరువు తగ్గిందట. ఇంకా తగ్గుతానంటోంది. గతంలో అధిక బరువు కారణంగానే అవకాశాలు తగ్గాయి నమితకు. అందుకే ఇకపై బరువు జోలికి పోకుండా, ఫిజిక్‌పై పూర్తి కాన్‌సన్‌ట్రేషన్ చేస్తానని చెబుతోంది అందాల నమిత.
అంటే త్వరలోనే నమితను తెలుగులోనూ మంచి రోల్స్‌లో చూడబోతున్నామన్న మాట.