ఎంతగా సెన్సేషన్ అందుకుందో అంతగానే రూమర్స్‌ని కూడా తన ఖాతాలో వేసుకుంది నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. ఏ కొత్త హీరోయిన్ విషయంలోనూ రానన్ని రూమర్స్, గాసిప్స్ సాయి పల్లవి చుట్టూ చక్కర్లు కొట్టాయి. కొడుతూనే ఉన్నాయ్. చేసినవి తక్కువ సినిమాలే అయినా, తొలి సినిమా 'ఫిదా'తో సాధించిన సక్సెస్, సెన్సేషన్‌కి సమానమైన కాంట్రవర్సీలు తదుపరి సినిమాలతో సాయి పల్లవి వెంట తెచ్చుకుంది.
ప్రస్తుతం సాయి పల్లవి నటిస్తున్న తాజా చిత్రం 'పడి పడి లేచె మనసు'. శర్వానంద్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. వచ్చే నెల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ లోగా సినిమాలోని కొన్ని సీన్లు రీ షూట్స్ చేస్తున్నారంటూ ఓ గాసిప్ బయటికి వచ్చింది. ఆ రీ షూట్ సీన్స్‌కి సాయి పల్లవి నుండి ఎక్స్‌ట్రా డేట్స్ అవసరమయ్యాయనీ, అందుకు ఆమె సమ్మతించలేదనీ, చిత్ర యూనిట్ గట్టిగా పట్టు పట్టేసరికి ఆ సీన్స్‌లో నటించేందుకు సాయిపల్లవి ఎక్స్‌ట్రా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. సంపాదన కన్నా నటిగా మంచి గుర్తింపే తనకు మిన్నా అని గతంలో సాయి పల్లవి చెప్పుకొచ్చింది.
అయినా ఆమె విషయంలో ఇలాంటి గాసిప్స్ ఏంటో.! మొన్నీ మధ్యనే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో శర్వానంద్ సాయి పల్లవి చాలా మంచి స్టార్ అనీ, ఆటిట్యూడ్ పరంగా మిస్ పర్‌ఫెక్షనిస్ట్ అంటూ సాయిపల్లవికి కితాబిచ్చాడు. అయినా సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న ఈ తరుణంలో సాయి పల్లవిని ఈ కొత్త రూమర్స్ వెంటాడడం కాస్త బాధాకరమైన అంశమే.
నేచురల్ టాలెంట్‌తో కెరీర్‌లో ముందుకు దూసుకెళ్తున్నా, ఎందుకో సాయిపల్లవిని గాసిప్స్ అడుగడుగునా చికాకు పెట్టేస్తున్నాయి.