'సొంతం' సినిమాతో తెలుగు ప్రేక్షకులను క్యూట్‌గా పలకరించిన బ్యూటీ నమిత. తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. కానీ స్టార్‌డమ్ సంపాదించలేకపోయింది. ఆ తర్వాత బొద్దుగా మారింది. బొద్దు అందాలు మన తెలుగు ఆడియన్స్‌కి అంతగా రుచించవు. దాంతో కోలీవుడ్‌లో అడుగు పెట్టింది.
బొద్దుగుమ్మల్ని బాగా ఇష్టపడే తమిళ తంబీలు నమితకు పట్టం కట్టేశారు. తెలుగులో వద్దన్న అదే బొద్దుతనం అక్కడ ముద్దయ్యింది. దాంతో కోలీవుడ్‌లో స్టార్ ఇమేజ్ కొట్టేసింది అందాల నమిత. బొద్దుగా ముద్దుగా, మాంచి మాస్ మాసాలా హీరోయిన్‌గా అక్కడే సెటిలైపోయింది. ఈ మధ్యనే పెళ్లి చేసుకుని ఒకింటిదైన నమిత, మ్యారేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేసి, ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోందట.
టి. రాజేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంతో నమిత రీ ఎంట్రీ ఇవ్వబోతోందంటూ తెలుస్తోంది. ఈ సినిమాలో నమిత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. అందుకోసం ఆమె పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తోందంటూ కోలీవుడ్ వర్గాల సమాచారమ్. ఇంతవరకూ నమిత తీసుకోని భారీ రెమ్యునరేషన్ అది అని తెలుస్తోంది. ఆ పాత్రకు నమిత అయితేనే సరిపోతుంది అని ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి ఆ పాత్రకు ఓకే చేశారనీ తెలుస్తోంది.
మొత్తానికి రీ ఎంట్రీలో నమిత ఫస్ట్ ఫస్టే భారీ మొత్తంలో క్యాస్ చేసుకుంటోందన్న మాట. అంతేకాదు, నమిత చాలా మారిపోయిందండోయ్. ఇకపై గ్లామరస్ పాత్రల్లో నమితని చూడలేమేమో. ఎందుకంటే, విభిన్న తరహా పాత్రలు, హుందా అయిన పాత్రలనే నమిత ఒప్పుకోనుందట. అదీ సంగతి.